Allu Aravind Crucial Comments on Theatres: సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల థియేటర్ల కేటాయింపులో అనూహ్యంగా పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమా అని చెబుతూనే దిల్ రాజు తాను రిలీజ్ చేస్తున్న వారసుడు సినిమాకి పెద్ద ఎత్తున థియేటర్లను కేటాయించుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాలలో థియేటర్లు ఎక్కువగా నలుగురు నిర్మాతల చేతుల్లో ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతూ ఉంటుంది.
దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, ఏషియన్ సునీల్ అనే నలుగురు నిర్మాతల చేతుల్లో అత్యధిక భాగం ధియేటర్లు ఉన్నాయని వారే వాటిని లీజుకు తీసుకుని నడిపిస్తున్నారని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వివరిస్తున్న అన్ స్టాపబుల్ తాజా ఎపిసోడ్ లో అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో థియేటర్ల గురించి అల్లు అరవింద్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకానొక సమయంలో థియేటర్ లు తీవ్ర నష్టాల్లో మునిగిపోతున్న సమయంలో ఓనర్లు నిస్సహాయత వ్యక్తం చేశారని, థియేటర్లు యధావిధిగా నడిపించడం సంగతి అటు ఉంచితే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు చెల్లించి సినిమాలు కూడా కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో థియేటర్ల నిర్వహణ పెనుభారంగా మారడంతో థియేటర్లను మీరే నిర్వహించి ఏటా మాకు కొంత డబ్బులు ఇవ్వండి అంటూ థియేటర్ల యజమానులు నిర్మాతలను కోరారని అల్లు అరవింద్ పేర్కొన్నారు.
ఆ విధంగా తాము థియేటర్లను లీజుకు తీసుకుని వాటికి మా తాహతుకు తగిన విధంగా హంగులు కల్పించామని చెప్పుకొచ్చారు. అలా మా ఆధ్వర్యంలోకి వచ్చాక మేము చేసిన ఆధునీకరణ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లకు కొత్త శోభ వచ్చిందని అలా ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగిందని చెప్పుకొచ్చారు. థియేటర్లను అలా మోడరన్ గా తయారు చేసేందుకు కొన్ని కోట్ల రూపాయల ఖర్చు చేశామని అన్ని రకాల సదుపాయాలతో వాటిని కొత్త పెళ్లి కూతుర్లలా ముస్తాబు చేశామని చెప్పుకొచ్చారు.
అలా చేయడం వల్లే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరగడమే కాకుండా కలెక్షన్లు కూడా పెరిగాయి అని చెప్పుకొచ్చారు. ఇక అలా థియేటర్లను తీసుకోవడం వల్లే ఇప్పుడు చాలామంది ఈ నిర్మాతలను టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది, కానీ ఆ విషయం మీద మాత్రం ఆయన ఎలాంటి కామెంట్స్ చేయలేదు.
Also Read: #NTRforSDT : మెగా హీరో సినిమాను ప్రమోట్ చేస్తున్న జూ.ఎన్టీఆర్.. ఆయన కోసమేనా?
Also Read: Kittu Vissapragada: నన్ను మెడపట్టి గెంటేశారని రాశారు.. వామ్మో అంటున్న తెలుగు లిరిసిస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook