Varun Tej Lavanya Wedding Invitation: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలిసిన దగ్గర నుంచి మెగా అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయింది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు వారి మదిని దోచిన హీరోయిన్ లావణ్య. ఆ తరువాత కూడా ఎక్స్పోజింగ్ కి దూరంగా ఉంటూ మంచి సినిమాలలో చేసింది ఈ హీరోయిన్. ఇక ఈ హీరోయిన్ వరుణ్ తో మిస్టర్ అలానే అంతరిక్షం అనే రెండు సినిమాలలో కలిసి నటించింది. ఇక సినిమాల దగ్గర నుంచి మొదలైన వీరిద్దరి ప్రేమ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల పెళ్లి పత్రిక బయటకు వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వీళ్ళ పెళ్లి పత్రిక విషయానికి వస్తే ఆ పెళ్లి పత్రిక ఓ బాక్స్ లాగా ఉంది. ఆ పత్రిక పైన వరుణ్ అలానే లావణ్య పేరు మొదటి అక్షరాలు అనగా వీఎల్ అనే ఇంగ్లిష్ అక్షరాలు ఉన్నాయి. ఇక బాక్స్ తెరిచిన తర్వాత కొణిదెల వారి పెళ్లి పిలుపు అని రాసి ఉంది. శ్రీమతి అంజనా దేవి, కీర్తి శేషులు కొణిదెల వెంకటరావు, కీర్తిశేషులు సత్యవతి, సూర్యనారాయణ ఆశీస్సులతో అని తొలి కార్డ్ లో ఉంది. ఇక ఆ తర్వాత చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ పేర్లు కూడా ఈ పెళ్లి పత్రికలో ఉండడం విశేషం. చివర్‌ లో వరుణ్ తల్లిదండ్రులు పద్మజ, నాగబాబు బంధుమిత్రులను ఆహ్వానిస్తున్నట్లుగా ఉంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇక వీరిద్దరి పెళ్లి వేడుకలు ఇటలీలో జరగనున్నాయని ఇక ఆ తరువాత రిసెప్షన్ మాత్రం హైదరాబాదులోని మాదాపూర్ లో ఉన్న ఎన్ కన్వెన్షన్ లో నవంబర్ 5వ తారీఖున సాయంత్రం ఏడు గంటలకు జరగనుంది అని. వీళ్ల రిసెప్షన్ కు టాలీవుడ్, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఎంతో మంది హాజరు కానున్నారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పెళ్లికి ముందే అక్టోబర్ 30న ఇటలీలోని టస్కనీలో ఈ జంట కాక్‌టెయిల్ పార్టీ కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వెంటనే తదుపరి రోజు అక్టోబర్ 31 న మెహెందీ, ఫంక్షన్ ఉండబోతుంది. నవంబర్ 1న కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వరుణ్, లావణ్య పెళ్లితో ఒక్కటి కానున్నారు.


Also Read: Fixed Deposit Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన బ్యాంక్.. ఎఫ్‌డీలపై వడ్డీరేట్లు పెంపు   


Also Read: Tirumala Temple: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ఆలయం మూసివేత 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి