Venkatesh Drishyam 2: మలయాళంలో విజయవంతమైన 'దృశ్యం 2' తెలుగులోనూ అదే పేరుతో రూపొందింది. ఇందులో వెంకటేష్, మీనా ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఇదివరకే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. దృశ్యం 2 చిత్రాన్ని నవంబరు 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణసంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది.  



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోహన్ లాల్ ప్రధానపాత్రలో రూపొందిన మలయాళ హిట్ చిత్రం ‘దృశ్యం 2’ సినిమాకు రీమేక్ ఇది. మాతృకకు దర్శకత్వం వహించిన జీతూ జోసెఫ్ ఈ సినిమానూ రూపొందించడం విశేషం. ఇందులో వెంకీ సరసన మీనా (Venkatesh Meena Movies List) నటించింది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.


ఇటీవలే ‘నారప్ప’ సినిమాతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు కథానాయకుడు వెంకటేష్. ఈ సినిమాలోని తన నటనతో వెంకటేష్ మంచి మార్కులే కొట్టేశారు. ఇదిలా ఉండగా.. వెంకటేష్ ప్రస్తుతం ‘ఎఫ్ 3’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న (F3 Movie Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమా చేయనున్నారని గతంలో ప్రచారం జరిగింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది. 


Also Read: Mega Collaboration: చిరు-సల్మాన్ చిందేయనున్న పాట కోసం 'బ్రిట్నీ స్పియర్స్‌'..?? 


Also Read: Prabhas Fan Suicide: ప్రభాస్ ఫ్యాన్స్ సూసైడ్ నోట్ వైరల్.. ‘యూవీ క్రియేషన్స్ సంస్థే కారణం!’ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook