Venkatesh Salman Khan: సల్మాన్ ఖాన్‌తో వెంకటేష్.. షూటింగ్ డేట్ ఫిక్స్!
Venkatesh to join Salman Khan movie. సల్మాన్ ఖాన్ సినిమా `కభి ఈద్ కభి దివాళి` చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
Venkatesh to join Salman Khan movie Kabhi Eid Kabhi Diwali shooting in June: ఇటీవలి కాలంలో మల్టి స్టారర్ సినిమాలు ఎక్కువైన విషయం తెలిసిందే. ఇద్దరు అగ్ర హీరోలు కలిసి సినిమా చేస్తున్నారు. ఓ హీరో విలన్ పాత్ర చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించడం చాలా అరుదు. త్వరలో అది కూడా జరగనుంది. టాలీవుడ్ స్టార్ హీరో 'విక్టరీ' వెంకటేశ్ త్వరలో బాలీవుడ్ సినిమా చేయబోతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో వెంకీ సినిమా చేస్తున్నారు. సాజిద్ నదియావాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కభి ఈద్ కభి దివాళి' సినిమాలో ఈ స్టార్స్ కలిసి నటించనున్నారు.
'కభి ఈద్ కభి దివాళి' చిత్రంలో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వెంకీ ఫన్నీ పాత్ర చేయనున్నాడని సమాచారం. వెంకటేశ్ జూన్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కాబోతున్నాడట. సల్మాన్ ఖాన్, వెంకటేశ్ క్రేజీ కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎలా ఉండబోతుందని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వెంకీ, సల్లూభాయ్ ఇద్దరూ కూడా కామెడీ పండించడంలో దిట్ట. అందుకే ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ ఐ రేంజ్‌లో ఉండనున్నాయని తెలుస్తోంది.
కెరీర్ ప్రారంభం నుంచి సల్మాన్ ఖాన్, వెంకటేశ్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న సంగతి తెలిసిందే. వెంకీ ముంబై వెళ్లినా.. సల్లూభాయ్ హైదరాబాద్ వచ్చినా ఇద్దరు కలుసుకుంటారు. సల్మాన్ ఖాన్ నటించిన 'బాడీగార్డ్' చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో వెంకీ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. 'కభి ఈద్ కభి దివాళి' చిత్రం షూటింగ్ మే 11న ముంబైలో వేసిన స్పెషల్ సెట్‌లో షురూ అయింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ప్రస్తుతం 'విక్టరీ' వెంకటేశ్ ఎఫ్ 3 సినిమా పూర్తిచేసి.. విడుదల కోసం వేచిచుస్తున్నాడు. ఏప్రిల్ 27 ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వెంకీ బిజీగా ఉన్నాడు. మరోవైపు కత్రినాకైఫ్‌తో కలిసి సల్మాన్ ఖాన్ 'టైగర్ 3' సినిమా కూడా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను పూర్తి చేసే పనిలో సల్లూభాయ్ ఉన్నాడు.
Also Read: Viral Video: కొత్తగా పెళ్లయిన ఇంజనీర్ కోడలు.. అత్తగారి వంట టార్చర్ భరించలేక..! వీడియో చూస్తే నవ్వులే
Also Read: Janhvi Kapoor Bikini Pics: చేయి అడ్డుపెట్టి.. ఎద అందాలు దాచేసిన జాన్వీ కపూర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.