Venkatesh, Varun Tej's F3 Movie release postponed to summer director anil ravipudi gives clarity on F3 release: సంక్రాంతి అంటే సినిమాల పండగ. చాలా వరకు పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి బరిలో నిలుస్తుంటాయి. అయితే ఈ ఏడాది ముందుగా అనుకున్నట్లుగా ఏ మూవీ కూడా సంక్రాంతి బరిలోకి సరిగ్గా రాలేకపోతోంది. కోవిడ్, ఒమిక్రాన్ దృష్టా కొన్ని సినిమాలు వాయిదా పడుతుండగా.. మరికొన్ని మూవీలు ఇతర కారణాల వల్ల పోస్ట్‌ పోన్ అవుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎఫ్‌2 తో ఎంతో వినోదాన్ని పంచిన విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ ఎఫ్‌3 వస్తున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ అనిల్‌ రావిపూడి మరింత నవ్వుల డోస్‌ పెంచి ఎఫ్‌3 తెరకెక్కిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్‌2కి (F2) కంటిన్యూయెస్‌గా ఎఫ్‌3 తెరకెక్కుతోంది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ (Sri Venkateswara Creations) ఎఫ్‌3 (F3 Movie) మూవీని నిర్మిస్తోంది. దిల్‌రాజు (Dil Raju) సమర్పిస్తున్నారు. శిరీష్‌ (Shirish) నిర్మిస్తున్నారు. 


ఎఫ్‌ 2 మూవీ 2019లో సంక్రాంతికి రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఎఫ్‌3 (F3 Movie) మూవీ కూడా మొదట 2022 సంక్రాంతికి రిలీజ్ అవుతుందనుకున్నారు. ఎఫ్‌3 మూవీ కూడా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోనున్నట్లు మూవీ యూనిట్ ఇది వరకే ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్టా ఎఫ్‌3 యూనిట్ మూవీ రిలీజ్‌పై మళ్లీ క్లారిటీ ఇచ్చింది. ఎఫ్‌3 మూవీ ఏప్రిల్‌ 29కి వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇస్తోన్న ఒక వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.


Also Read : LPG Price: న్యూ ఇయర్ రోజు గుడ్​ న్యూస్​- తగ్గిన సిలిండర్ ధరలు!


మూవీ రిలీజ్‌పై ఒక ఫ్యాన్.. డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య డిస్కషన్ జరిగితే ఎలా ఉంటుందో చిత్రీకరించిన వీడియోను.. హ్యాపీ న్యూ ఇయర్ - F3 ఫీట్ నాగరత్తమ్మ అనే క్యాప్షన్‌తో యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఈ సారి సంక్రాంతి అల్లుళ్ళు కాదు.. సమ్మర్ సోగ్గాళ్లు అంటూ డైరెక్టర్ అనిల్ రావిపూడి మూవీ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చారు. మరింత వినోదభరితంగా ఎఫ్‌3 సినిమాతో ఈ సమ్మర్‌‌లో థియేటర్‌లను షేక్ చేస్తేస్తామన్నారు అనిల్ రావిపూడి.



 


 


ఇక ఎఫ్‌3 మూవీలో వెంకటేష్‌ (Venkatesh) సరసన తమన్నా,( Tamannaah) వరుణ్‌ తేజ్‌కు (Varun Tej) జోడీగా మెహ్రీన్‌ (Mehreen) నటిస్తున్నారు. నవ్వుల జల్లుల్ని కురిపించేలా మూవీని తెరకెక్కిస్తున్నారు అనిల్‌ రావిపూడి. మూవీకి దేవిశ్రీప్రసాద్‌ (Devi Sri Prasad) మ్యూజిక్ అందిస్తున్నారు.



Also Read : Covid 19: 10 మంది మంత్రులు.. 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా! అసలు కారణం ఏంటంటే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook