Covid 19: 10 మంది మంత్రులు.. 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా! అసలు కారణం ఏంటంటే!!

మహారాష్ట్రలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 12:57 PM IST
  • మంది మంత్రులకు కరోనా
  • 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా
  • మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కలకలం
Covid 19: 10 మంది మంత్రులు.. 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా! అసలు కారణం ఏంటంటే!!

10 Ministers, 20 plus MLAs test positive for Covid 19 in Maharashtra: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ (Coronavirus) మహమ్మారి మరోసారి కలకలం రేపింది. ప్రతిరోజు మహారాష్ట్ర (Maharashtra)లో కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. అయితే ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడడం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన 10 మంది మంత్రులు (Ministers), 20 మందికి పైగా ఎమ్మెల్యే (MLA)లకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ (Ajit Pawar) వెల్లడించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలే వైరస్‌ వ్యాప్తికి కారణమయ్యాయి. 

ఈ రోజు ఉదయం అజిత్‌ పవార్‌ మీడియాతో మాట్లాడుతూ... 'మహారాష్ట్రలో కరోనా వైరస్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు తప్పవు. కొత్త వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రధాని మోదీ సైతం ప్రజలను ఇదే కోరారు. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూలు విధించారు. ముంబై, పుణెలో కేసులు అత్యధికంగా ఉన్నాయి. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రాష్ట్రంలో క్రమంగా పెరుగుతోంది. ఇది ఇలాగే కొనసాగితే కఠిన ఆంక్షలు అనివార్యం అవుతాయి. ఆంక్షల నుంచి తప్పించుకోవాలంటే ప్రతిఒక్కరూ కరోనా నిబంధనలను తప్పుకుండా పాటించాలి' అని అన్నారు. 

Also Read: LPG Price: న్యూ ఇయర్ రోజు గుడ్​ న్యూస్​- తగ్గిన ఎల్​పీజీ సిలిండర్ ధరలు!

గత 12 రోజుల్లో మహారాష్ట్రలో కరోనా కేసులు (Covid 19) క్రమంగా పెరిగాయి. ముంబైలో శుక్రవారం 5631 కొత్త కేసులు నమోదయ్యాయి. గురువారంతో పోలిస్తే 2000 కేసులు అధికంగా వచ్చాయి. ప్రస్తుతం నగరంలో కేసులు 785110కి చేరాయి. మరోవైపు పుణెలో పాజిటివ్‌ కేసుల రేటు 5.9 శాతం పెరిగింది. శుక్రవారం కొత్తగా 412 కేసులు నమోదయ్యాయి. దీంతో  పుణెలో కేసుల సంఖ్య 510218కి చేరింది. ఇక దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ (Omicron)  వేగంగా విస్తరిస్తోంది. ఆ మధ్య కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. గత 2-3 రోజులుగా విపరీతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్త కేసుల సంఖ్య 22వేలు దాటాయి. ఇక ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య 1431కు చేరింది.

Also Read: Swag of Bhola : స్వాగ్ ఆఫ్ భోళాలో చిరు మాస్‌ లుక్ అదిరిపోయింది.. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ కిరాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News