O Manchi Ghost Movie Trailer: టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు హార్రర్, కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన OMG (ఓ మంచి ఘోస్ట్) మూవీ రెడీ అయింది. వెన్నెల కిషోర్, నందితా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహించారు. మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై డా.అబినికా ఇనాబతుని నిర్మించారు. షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 21న ఈ చిత్రం థియేటర్స్‌లో సందడి మొదలుపెట్టనుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్‌కు తోడు అనుప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తుండడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. నవిస్తునే భయపెట్టిన ట్రైలర్‌తో ఊహించని ట్విస్టులతో మరింత అంచనాలను పెంచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ప్రభాస్ కల్కి సినిమాలో కృష్ణార్జునులుగా కనిపించనున్న తెలుగు హీరోలు.. ఎవరంటే!


‘ఈ బంగ్లాలో ఒక అమ్మాయిని చంపేశారు.. ఆ అమ్మాయే దెయ్యంగా మారి అందరినీ చంపేస్తోందని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ప్రారంభించారు. నలుగురు స్నేహితులు డబ్బు కోసం ప్లాన్ చేస్తుంటారు. ‘అందరి సమస్యలు వేరే అయినా వాటికి పరిష్కారం మాత్రం డబ్బు’.. అని ఆ గ్యాంగ్ పిశాచీపురంలోకి ఎంటర్ అవ్వడంతో ఫన్ ఎలిమెంట్స్ స్టార్ట్ అయ్యాయి. 'ఇప్పటి వరకు ఆటాడితే ఎలా ఉంటుందో చూశారు.. ఇప్పుడు వేటాడితే ఎలా ఉంటుందో చూపిద్దాం..' అంటూ అసలైన హారర్ బొమ్మని చూపించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఎంతలా నవ్విస్తారో.. అంతలా భయపెట్టించేలా ఉన్నారు.


ట్రైలర్ చూసిన తరువాత ఈ సినిమాలో కామెడీ, సూపర్ నేచురల్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇలా అన్నీ ఉన్నాయని తెలుస్తోంది. ట్రైలర్ నవ్వించడమే కాదు భయపెట్టేసేలా ఉంది. నందితా శ్వేత దెయ్యం పాత్రలో భయపెడుతుంటే.. వెన్నెల కిషోర్, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు వంటి వారు నవ్వించేశారు. ఇక ఊహించని ట్విస్టులతో ప్రేక్షకలు థ్రిల్‌కు గురవ్వడం ఖాయమని మేకర్స్ చెబుతున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం ఈ చిత్రానికి మేజర్ అస్సెట్‌ కానుందని అంటున్నారు. ఈ సినిమా జూన్ 21న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోందని.. ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూసి ఆదరించాలని కోరుతున్నారు.


నటీనటులు: వెన్నెల కిషోర్, నందితా శ్వేత, నవమి గాయక్, షకలక శంకర్, రజత్ రాఘవ్, నవీన్ నేని, రఘు బాబు, నాగినీడు, బాహుబలి ప్రభాకర్, షేకింగ్ శేషు, తదితరులు.


సాంకేతిక సిబ్బంది:


==> దర్శకుడు: శంకర్ మార్తాండ్
==> నిర్మాత: డా.అబినికా ఇనాబతుని
==> సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
==> బ్యానర్: మార్క్ సెట్ నెట్‌వర్క్‌లు
==> సినిమాటోగ్రాఫర్: ఐ ఆండ్రూ
==> ఆర్ట్ డైరెక్టర్: సుప్రియ
==> ఎడిటర్: ఎం.ఆర్.వర్మ
==> కొరియోగ్రాఫర్: బాబా భాస్కర్
==> విజువల్ ఎఫెక్ట్స్: విక్టర్, కళ్యాణ్, విజయ్
==> PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్)


Also Read: Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter