Nani role in Kalki: ఈ మధ్యనే సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. తాజాగా ఇప్పుడు కల్కి సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్.. దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే హీరోయిన్ గా నటించింది.
భారీ తారాగణంతో ఈ సినిమా.. అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్ర హీరోలు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో.. కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో.. ఇద్దరు యువ హీరోలు కూడా.. కీలక పాత్రలలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ఇద్దరు హీరోలు మరెవరో కాదు.. ఒకరు విజయ్ దేవరకొండ కాగా.. మరొకరు న్యాచురల్ స్టార్ నాని అని తెలుస్తోంది.
న్యాచురల్ స్టార్ నాని కల్కి సినిమాలో కృష్ణుడి పాత్రలో కనిపించనున్నారని, ఇక విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. అయితే టైటిల్ లోనే సినిమా 2898 ఏడిలో జరుగుతుంది అని తెలుస్తుంది. మరి ఆ టైంలో కృష్ణ, అర్జున పాత్రలు ఎందుకు వస్తాయి? మహాభారతానికి కల్కి కి సంబంధం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
అయితే దీని వెనుక కూడా పెద్ద కథ ఉంటుందట. ద్వాపర యుగం నుంచి కలియుగం దాకా ఈ సినిమాలో నాగ అశ్విన్ కథతోపాటు మనతో కూడా ప్రయాణం చేయిస్తారని తెలుస్తోంది. గతంలో విజయ్ దేవరకొండ.. ఈ సినిమాలో కల్కి పాత్రలో కనిపిస్తారేమోనని కొందరు కామెంట్లు చేశారు. కానీ ప్రభాస్ మాత్రమే కల్కి పాత్రలో.. కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
మరోవైపు ప్రభాస్, నాని, విజయ్ దేవరకొండ ప్రభాస్ కలిసి నటించే సన్నివేశాలు.. ఏమైనా ఉంటాయో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో నాని హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలోనే నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కూడా.. విజయ్ దేవరకొండ కీలక పాత్రలో.. కనిపించారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీళ్ళిద్దరి కాంబో.. అది కూడా ప్రభాస్ వంటి స్టార్ హీరో సినిమాలో చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారీ అంచనాల మధ్య కల్కి సినిమా ఈనెల 27వ తేదీన విడుదలకు సిద్ధం అవుతుంది.
Also Read: Nara Lokesh: యాక్షన్ మోడ్ ఆన్.. తొలి అడుగులోనే మంత్రి లోకేష్ ఊహించని నిర్ణయం
Also Read: Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్.. వైఎస్సార్సీపీకి కలిసొచ్చిన అదృష్టం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి