Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..

Ap Deputy cm pawan kalyan: మెగాస్టార్ చిరంజీవి తన మరిది, డిప్యూటీ సీఎంకు ప్రత్యేక బహుమతి ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Jun 15, 2024, 07:15 PM IST
  • డిప్యూటీ సీఎం కు స్పెషల్ గిఫ్ట్..
  • అన్న, వదినమ్మలను హత్తుకున్న జనసేనాని..
 Pawan kalyan: పవన్ కు వదినమ్మ స్పెషల్ బహుమతి.. ఎమోషనల్ అయిన డిప్యూటీ సీఎం.. వీడియో వైరల్..

Surekha konidela special pen gift for pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ కు డిప్యూటీ సీఎంతో పాటు, మరో ఆరు శాఖలను సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు కేటాయించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు..  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను ఆయనకు కేటాయించారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయన తన శాఖల అధికారులతో సమావేశాలను నిర్వహిస్తున్నారు. తన శాఖల విషయంలో ఎలాంటి విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వనని, పవన్ ఇప్పటికే అధికారులకు వార్నింగ్ కూడా ఇచ్చారు. 

 

ఇదే క్రమంలో డిప్యూటీ సీఎంతోపాటు, ఆరు శాఖలను కేటాయించిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, పవన్ కళ్యాణ్ ను కలిసి సర్ ప్రైజ్ చేశారు. సురేఖ..తన మరిదికి ఒక ఇంపోర్టేడ్ పెన్నును ఆయన కోసం తీసుకొచ్చారు. అంతేకాకుండా... దాన్ని పవన్ కళ్యాణ్ జేబులో సైతం పెట్టారు. దీంతో పవన్ ఒక్కసారిగా ఎమోషనల్ కు గురయ్యారు. తల్లిదండ్రులుగా  భావించే తన అన్న చిరంజీవి, వదినమ్మ సురేఖలను హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. దీనితోనే అధికారిక కార్యకలాపాలు సాగించాలని సురేఖ కోరినట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ పెన్ను బహుమతి విషయం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి మెగాఅభిమానులు, జనసేన కార్యకర్తలు ఎమోషనల్ అవుతున్నారు. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి.. అన్నదమ్ముల బంధమంటే ఇది .. అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి.. తన అన్న చిరంజీవిని కలవడానికి వెళ్లినప్పుడు కేక్ కట్ చేయడం, అన్న కాళ్లమీద పడటం వంటి సంఘటనలు అందరి మనస్సులు హత్తుకునేవిగా మారాయి.

Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..

మరోవైపు.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం, పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా.. పవన్ కళ్యాణ్.. చిరంజీవి పాదల మీద పడి ఆయన బ్లేస్సింగ్స్ తీసుకున్నారు. ఫ్యామిలీ అంటే ఇలా ఉండలి.. మెగా బ్రదర్స్‌ అంటే ఇది అంటూ ఫ్యాన్స్  ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరోవైపు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పెన్ను ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేశారు.., చాలా కాస్లీపెన్ను.. దీని ఖరీదు లక్షల్లో ఉండోచ్చని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే రచ్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఇదే పెన్నుతో తన శాఖల ఫైళ్లపై సంతకాలు చేస్తారని తెలుస్తోంది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News