Movie news: కరోనా కారణంగా ఇప్పటికే సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron Effect on Cinema Industry) విజృంభిస్తుడటంతో..చాలా సినిమాలు వాయిదా వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నెలలో రిలీజ్ కావాల్సిన ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ వంటి పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. అయితే రాబోయే మూడు నెలల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామనుకున్న కొన్ని చిత్రాలకు ఈ పెద్ద చిత్రాల నుంచి తీవ్రమైన పోటీ నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ తప్పేలా లేదు. తాజా బజ్ ప్రకారం చూస్తే ‘కేజీఎఫ్-2’కు (KGF2) కూడా షాక్ తగిలేట్టుగానే కన్పిస్తోంది. ‘కేజీఎఫ్-2’ను ఏప్రిల్ 14న సోలో రిలీజ్ డేట్‌తో భారీగా ప్లాన్ చేశారు మేకర్స్. ‘కేజీఎఫ్-2’ టీం ఇతర చిత్రాలతో క్లాష్ అవ్వకుండా ఉండేందుకు ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే లాల్ సింగ్ చద్దా, ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలు ఇప్పుడు ఏప్రిల్‌ వైపు చూస్తున్నాయి. అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ (Laal Singh Chaddha) ఏప్రిల్ 14న విడుదలవుతుండగా, తాజా వార్తల ప్రకారం తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘బీస్ట్ (Beast Movie)’ కూడా అదే రోజు థియేటర్లలోకి సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Bheemla Nayak First Review: పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ఫస్ట్ రివ్యూ.. బాక్సాఫీస్ బద్దలుకొట్టడం ఖాయమట..!!


అయితే '‘ఆర్ఆర్ఆర్' (RRR Movie) కూడా మార్చి తేదీని మిస్ అయితే ఏప్రిల్ 28న విడుదల అవుతుంది. ఇదే జరిగితే ‘కేజీఎఫ్-2’కు తమిళనాడు, కేరళ, ఉత్తర భారతదేశంలో థియేటర్ల కొరత ఏర్పడుతుంది. ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ ఏప్రిల్ విడుదలకు వెళితే ‘కేజీఎఫ్-2’కు కేవలం రెండు వారాల డ్రీమ్ రన్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ తరుణంలో ‘కేజీఎఫ్-2’ వెనక్కి తగ్గడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ 200 కోట్ల కంటే ఎక్కువ థియేట్రికల్ టార్గెట్ ఖచ్చితంగా అంత ఈజీ కాదు. మరి ‘కేజీఎఫ్-2’ నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి