Liger Movie 2 Days Collections: రెండో రోజు దారుణంగా కలెక్షన్స్.. కానీ హిందీలో మాత్రం అదుర్స్!
Vijay Devarakonda Liger Movie 2 Days World Wide Collections: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా రెండో రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే
Vijay Devarakonda Liger Movie 2 Days World Wide Collections: రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీ ఆగస్టు 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్ గా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించడమే గాక స్వయంగా నిర్మించిన ఈ సినిమాకు ఛార్మి కౌర్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్, అపూర్వ మెహతా సహనిర్మాతలుగా వ్యవహరించారు.
ఇక ఈ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ మొదటి రోజు మాత్రం కలెక్షన్లు భారీగానే వచ్చాయి రెండో రోజు కలెక్షన్స్ లో మాత్రం మొదటి రోజు కలెక్షన్స్ లో దాదాపు 80% డ్రాప్ కనిపించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 9 కోట్ల యాభై ఏడు లక్షల వసూళ్లు సాధించిన లైగర్ సినిమా రెండో రోజు మాత్రం కోటి రూపాయల 54 లక్షలు మాత్రమే సాధించింది. తద్వారా రెండు రోజులకు గాను 11 కోట్ల 11 లక్షల షేర్ 18 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.
ఇక కర్ణాటక సహా మిగతా భారత దేశంలో 75 లక్షలు, ఇతర భాషలలో 35 లక్షలు సాధించిన ఈ సినిమా నార్త్ ఇండియాలో రెండున్నర కోట్లు సాధించి మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక గురువారం ప్రీమియర్స్ అలాగే శుక్రవారం వసూళ్లు లెక్కేస్తే రూ. 5.5 కోట్ల నెట్ కలెక్షన్ అని లెక్కలు చెబుతున్నాయి.
బ్రేక్ ఈవెన్ తో పోలిస్తే ఇది తక్కువే అయినా విజయ్ దేవరకొండ లాంటి కొత్త హీరోకు నార్త్ వాళ్లు మంచి ఆదరణ చూపించారనే చెప్పాలి. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమా రెండు కోట్ల 80 లక్షల సాధించింది. సుమారు 88 కోట్ల నలభై లక్షల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకు 90 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్గా నిర్ణయించారు. ఇంకా ఈ సినిమా 72 కోట్ల 49 లక్షలు వసూలు చేస్తే హిట్ స్టేటస్ సాధిస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న టాక్ ప్రకారం అంత వసూలు సాధించడం అనేది మామూలు విషయం కాదు అనే చెప్పాలి.
Also Read: Gross, Net and Share Collections: గ్రాస్, నెట్, షేర్ వసూళ్లకు తేడా ఏంటో తెలుసా?
Also Read: September 2022 Movie Releases: ఏకంగా 17 సినిమాలు రిలీజ్.. లిస్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి