Nani-Mrunal :  నేచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్‍గా నటిస్తున్న హాయ్ నాన్న సినిమాపై ప్రేక్షకులకు చాలా. ప్రమోషన్లలను కూడా ఇప్పటికే జోరుగా చేస్తోంది మూవీ యూనిట్. ముఖ్యంగా హీరో నాని చాలా రోజుల నుంచే ఈ సినిమా కోసం వివిధ రీతుల్లో క్రియేటివ్‍గా ప్రచారం చేస్తున్నారు. కాగా ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన విడుదల కావస్తుండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


తండ్రీకూతుళ్ల మధ్య బంధం, లవ్ స్టోరీ ప్రధాన కథాంశాలుగా హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. నాని కూతురు పాత్రలో బేబి కియారా ఖన్నా నటించారు. ఈ చిత్రంలో శృతిహాసన్ వర్ష అనే క్యామియో రోల్ లో కనిపించనుంది. జయరామ్, ప్రియదర్శి, అంగద్ బేడీ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్ర నటి నటుల మధ్య జరిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ఒక అనుకొని సంఘటన చోటుచేసుకుంది.


అదేమిటి అంటే…నిన్న అనుకోకుండా ఫ్రీ రిలీజ్ ఈవెంతలో స్క్రీన్ పైన విజయ్ దేవరకొండ.. రష్మిక పర్సనల్ ఫోటోలు ఇది చూసిన వెంటనే నాని నవ్వుతూ ఉండగా మృణాల్ మాత్రం అసలు ఏంటిది అన్నట్టు షాక్ అయిపోయింది. వెంటనే సుమ అక్కడ ఉన్న కెమెరామెన్ తో తమాషాగా నువ్వేనా వీళ్ళ ఫోటోలు తీసింది.. అలా పర్సనల్ ఫోటోలు తీయచ్చా అని విషయాన్ని కవర్ చేసింది.


కాగా స్క్రీన్ పైన ప్రత్యక్షమైన ఫోటోలు ఏమిటి అనగా.. అప్పట్లో విజయ్ దేవరకొండ మాల్దీవ్స్ ట్రిప్ కి వెళ్ళినప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఒక ఫోజ్ ఇచ్చి ఆ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు.. కాసేపటికి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గరే రష్మిక మందాన కూడా అతని ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఫోటో షేర్ చేసింది. ఇక అప్పట్లో నేటిజన్స్ ఈ రెండు ఫోటోలు కలిపి వీరిద్దరూ ఒకే దగ్గర ఉన్నారు అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు ఇలా నేటిజన్స్ కలిపిన వీరిద్దరి ఫోటోని హాయ్ నాన్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్ స్క్రీన్ పైన వేసి అందరిని ఆశ్చర్యపరిచారు



 


Also Read: Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్ల కన్ను..కోట్ల రూపాయల్లో బెట్టింగ్ నిర్వహణ..


Also Read: Vivo S18 Pro Price: శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్లోకి Vivo S18, Vivo S18 Pro మొబైల్స్..ధర, విడుదల తేదీ వివరాలు ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook