Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్ల కన్ను..కోట్ల రూపాయల్లో బెట్టింగ్ నిర్వహణ..

Election In Telangana 2023: బెట్టింగ్ రాయుళ్లు తమ రూట్ మార్చుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఏ పార్టీ గెలుస్తుందని అంశంపై జోరుగా బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఆఫ్లైన్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా ఈ బెట్టింగ్లను ప్రారంభించినట్లు అనధికారక సమాచారం. అయితే ఇప్పటికీ కొన్ని హోటల్స్ లో కూడా ఈ బెట్టింగ్ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 29, 2023, 07:59 PM IST
Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బెట్టింగ్ రాయుళ్ల కన్ను..కోట్ల రూపాయల్లో బెట్టింగ్ నిర్వహణ..

Election In Telangana 2023: తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కి రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాలు సిద్ధమయ్యాయి. ఎన్నికల కోసం అధికారులు గత రెండు రోజుల నుంచి పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇక సిటీకి ఉపాధి కోసం వచ్చిన కొంతమంది ఓటు వేసేందుకు సొంతూళ్లకు కూడా వెళ్తున్నారు. అయితే ఇంకా అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకముందే.. బెట్టింగ్ రాయుళ్లు తమ బెట్టింగ్ ప్రక్రియను ప్రారంభించారు. క్రికెట్ బెట్టింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో అదే స్థాయిలో ఎన్నికలపై బెట్టింగ్ ప్రారంభమయింది. ఈ బెట్టింగ్ ను హైదరాబాద్ తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నిర్వహిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అయితే క్రికెట్ బెట్టింగ్ మాదిరిగానే అసెంబ్లీ ఎన్నికల బెట్టింగ్ను ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో ఏమాత్రం గుట్టు చప్పుడు కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై లక్షల కోట్లు పందాలు కాస్తున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ పై కొన్ని అనధికారిక వెబ్సైట్లో రూ. 300 నుంచి రూ.400 వరకు బెట్టింగ్ రాయుళ్లు పందాలు కాస్తున్నట్లు అనధికారిక సమాచారం. తెలంగాణలో భారతీయ రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తే రూ.100 కి రూ.130 ఇస్తామంటూ బెట్టింగ్ నిర్వాహకులు ఊరిస్తున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.100కు రూ.115 ఇస్తామంటున్నారని సమాచారం. సాధారణంగా తెలంగాణలో గెలిచే పార్టీలపై బెట్టింగ్ పెడితే మార్జిన్ తక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చాలా వెబ్సైట్లో Brsపై బెట్టింగ్ కట్టిన వారికి మార్జిన్ ఎక్కువగా ఇస్తున్నట్లు అనధికారిక వర్గాల సమాచారం. దీన్ని బట్టి చూస్తే బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవని అందుకే మార్జిన్ ఎక్కువగా ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

ఏది ఏమైనా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బెట్టింగ్ నిర్వహించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అనధికారిక సమాచారం ప్రకారం..బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటమి విజయాలపై ఏకంగా ఒక వెబ్సైట్లో రూ.100 కోట్ల పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒక వెబ్సైట్లోనే ఇన్ని కోట్లకు పైగా పందేలు జరుగుతుంటే ఇంకా ఇతర వెబ్సైట్లో మరిన్ని కోట్ల రూపాయల పందేలు జరుగుతున్నాయో మీరే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీలో కూడా జోరుగా ఈ పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ అయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్, కౌంటింగ్ రోజు కూడా ఎన్నికలపై పందేలు జోరుగా సాగే అవకాశాలున్నాయి. బెట్టింగ్ రాయుళ్లు హోటల్స్, రెస్టారెంట్లలో జోరుగా ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News