Family Star Break Even :
అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలతో వరస విజయాలు అందుకున్న హీరో విజయ్ దేవరకొండ.. ఆ తరువాత మాత్రం ఒక్క సూపర్ హిట్ కూడా సాధించలేకపోయాడు. ఈ హీరో సినిమాలు అన్నీ కూడా వరస ప్లాపులు గా నిలిచాయి. ఈ మధ్య వచ్చిన ఖుషి సినిమాతో ఒక మోస్టారు విజయం సాధించిన ఆ సినిమా హిట్ క్రెడిట్ మొత్తం సమంత కొట్టేసింది. అంతేకాకుండా ఆ సినిమాకి జరిగిన హాయ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వల్ల ఆ చిత్రం కూడా లాభాల్లోకైతే రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఈ హీరో తన అంచనాలు అన్ని పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా పైన పెట్టుకున్నారు. తనకు గీతాగోవిందం రూపంలో మంచి విజయం అందించిన ఈ దర్శకుడు తప్పకుండా ఫ్యామిలీ సార్ తో మరో విజయం అందిస్తారు అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే విజయ్ అభిమానులు కూడా ఫ్యామిలీ స్టార్ మంచి సక్సెస్ సాధిస్తుందని అంచనాలు వేసుకున్నారు. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఈ సినిమా కూడా డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది.


ఈ సినిమా మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మొదటి రోజు నుంచే కలెక్షన్లు తగ్గిపోయాయి. ఆ తరువాత నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని ఎంత ప్రమోట్ చేసిన లాభం లేకుండా పోయింది. గత వారం మాత్రం ఏదో ఉగాది పండుగ వల్ల ఒకటి రెండు రోజులు సుమారు కలెక్షన్స్ వచ్చిన.హ మొత్తం పైన మాత్రం ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ రేంజ్ లో కలెక్షన్ రాలేదు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మంచిగానే జరగడం వల్ల ఈ చిత్రం  45 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిందని సమాచారం. కాగా ఈరోజుతో ఈ సినిమా పది రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఇంత వరకు ముప్పై కోట్ల గ్రాస్, 16 కోట్ల వరకు షేర్ మాత్రమే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంకా ముప్పై కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. 


ఇప్పటికే ఈ సినిమాకి జనాలు లేక ఎన్నో థియేటర్స్ నుంచి ఎత్తేశారు. మరోవైపు ఎప్పుడో విడుదలైన టిల్లు స్క్వేర్ మాత్రం ఇంకా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. మరో కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవడం అసాధ్యమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. దీంతో ఈ విజయ్ దేవరకొండ సినిమా కూడా డిజాస్టర్ వైపు పరుగులు తీస్తోంది.


Also Read: Jagan Attack: జగన్‌పై దాడి పక్కా ప్లాన్‌? లేదా స్టంట్‌.. ఘటనపై అనుమానాలు ఇవే..


Also Read: KA Paul Symbol: కేఏ పాల్‌కు భారీ షాక్‌.. హెలికాప్టర్‌ పోయి 'మట్టి కుండ' వచ్చేసింది



 


 


 


 


 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter