Vijay Deverakonda 10 Million Followers: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. స్టార్ హీరోలకు సైతం లేని ఫాలోయింగ్‌తో సోషల్ మీడియాలో రారాజుగా వెలిగిపోతున్నాడు రౌడీ హీరో విజయ్. ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో తనకంటూ గుర్తింపు దక్కే పాత్రల కోసం అతడు పడ్డ శ్రమ నేడు నిజమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రస్తుతం దక్షిణాదిన అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లు సొంతం చేసుకున్న హీరోగా విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నిలిచాడు. ‘అర్జున్ రెడ్డి’ విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్ల సంఖ్య 10 మిలియన్లకు చేరుకుంది. దీంతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. టాలీవుడ్‌లో 10 మిలియన్ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయర్లు కలిగి ఉన్న ఏకైక నటుడు విజయ్ దేవరకొండ కావడం గమనార్హం.


Also Read: Bigg Boss Telugu Sohel: సినిమా ఛాన్స్ కొట్టేసిన సోహైల్.. బిగ్‌బాస్ ఫేమ్ కథ వేరేనే ఉంది



 




తన ఖాతాలో 10 మంది ఫాలోయర్లు ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ ఏం మారలేదని, తాను అలాగే ఉన్నానంటూ ఈ సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఎప్పటికీ మీ ప్రేమ ఇలాగే ఉండాలి. రౌడీ లవ్ ఎప్పటికీ ఇలాగే ఉంటుందని కుర్చీలో దర్జాగా కూర్చున్న ఓ స్టిల్‌ను పోస్ట్ చేశాడు. విషయం తెలియగానే టాలీవుడ్ (Tollywood) రౌడీ హీరో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.


Gallery: Photos Of Actress in Backless Dress: టాప్ హీరోయిన్లు బ్యాక్‌లెస్ డ్రెస్సులో సన్నింగ్ లుక్స్



కెరీర్ విషయానికొస్తే.. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో కాస్త గుర్తింపు దక్కించుకున్నాడు. ఆపై పెళ్లిచూపులతో కెరీర్‌ను సరికొత్తగా ఆరంభించి సక్సెస్ సాధించాడు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తన మూవీ అర్జున్ రెడ్డి హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. 


Also Read: Bigg Boss 4 Telugu Funny Memes: బిగ్ బాస్ 4 ఫైనల్ తర్వాత వైరల్ అవుతున్న మీమ్స్



తనదైన యాటిట్యూడ్‌తో, అవసరం వచ్చినప్పుడు తెలంగాణ యాసలోనూ మాట్లాడుతూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఫైటర్’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచిన రెండున్నరేళ్ల వ్యవధిలోనే 10 మిలియన్ల ఫాలోయర్లు సాధించి టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు.
Gallery: Anchor Anasuya Photos: గ్రీన్ డెస్సులో గుబులురేపుతోన్న అనసూయ