Thalapathy Vijay GOAT: విజయ్ నటిస్తున్న గోట్.. చిత్రంపై అంచనాలు భారీగా నెలకొని ఉన్నాయి. ఈ మూవీని సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం విజయ్..నటిస్తున్న చివరి చిత్రం కావడంతో తమిళనాడులో ఈ చిత్రానికి ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్.. జోరుగా సాగుతున్నాయి. ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలు వెంకట్ ప్రభు.. నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా వెంకట ప్రభు.. దగ్గర ఈ మూవీ కోసం అసిస్టెంట్ గా జాయిన్ అయినా యూట్యూబర్ అభిషేక్ రాజా, మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. విజయ్ ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన.. ఫైనల్ కట్ ని చూసి చాలా ఎమోషనల్ అయ్యారట. ఇది తన చివరి సినిమా కాకపోయి ఉంటే కచ్చితంగా.. వెంకట్ ప్రభుతో మరొక సినిమా చేసి ఉండేవాడిని అని విజయ్ అన్నారు అని అభిషేక్ పేర్కొన్నాడు.


రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడానికి నిర్ణయించుకున్న విజయ్ తన నెక్స్ట్ మూవీ తలపతి 69 అనగా.. గోట్ చిత్రం తర్వాత.. సినీ ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉండడానికి ఫిక్స్ అయ్యారు. కానీ గోట్ సినిమా ఫైనల్ ప్రింట్ చూశాక.. రాజకీయాల్లోకి వెళ్ళకుంటే మరో సినిమా చేసే వారిని అంటూ అభిప్రాయపడ్డారట. 


కాగా టాలీవుడ్ లో కూడా విజయ్ కి అభిమానులు దండిగానే ఉన్నారు. అందుకే ఆయన డబ్బింగ్ చిత్రాలు ఇక్కడ కూడా మంచి వసూలు రాబడతాయి. ఈ నేపథ్యంలో గోట్ చిత్రం ఇది తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ కలెక్షన్స్ రాబడుతుందని.. అందరూ ఆశిస్తున్నారు.ఇక ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఇందులో విజయ్ కొడుకు పాత్రతోపాటు.. తండ్రి పాత్రను కూడా పోషిస్తున్నారు. ఇంతకుముందు 2019 లో విజయ నటించిన విజిల్ మూవీలో కూడా ఆయన తండ్రి,కొడుకు రెండు పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు.


గోట్ మూవీ నుంచి రీసెంట్ గా..స్పార్క్ పేరుతో థర్డ్ సింగల్ విడుదల అయింది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. కానీ మూడవ పాటలో విజయ్ చిన్నప్పటి క్యారెక్టర్ ని చూపించడానికి ఉపయోగించిన డి-ఏజింగ్ టెక్నిక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఇక ఈ సాంగ్. ట్రోలింగ్ కి కూడా గురి కావడం విశేషం. అంతేకాదు సినిమా మొత్తంలో ఇలాగే ఉంటే చాలా కష్టమని.. చిత్ర బృందం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని కొందరు సోషల్ మీడియాలో సలహాలు కూడా ఇస్తున్నారు.


Also Read: Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..


Also Read: Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter