Vikatakavi: జీ5లో ‘వికటకవి’ వెబ్ సిరీస్ ప్రేక్షకులను అలరిండం ఖాయం.. నిర్మాత రామ్ తాళ్లూరి..
Vikatakavi: నరేష్ అగస్త్య, మేఘా ఆకాశ్ లీడ్ రోల్లో ప్రదీప్ మద్దాలి డైరెక్షన్ లో ఫేమస్ ప్రొడక్షన్ హౌస్..ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ వెబ్ సిరీస్ నిర్మించారు. ఈ నెల 28 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ క్రమంలో వికటకవి యూనిట్.. మీడియాతో మాట్లాడారు.
Vikatakavi: జీ5 ఓటీటీ భారత దేశంలో అన్ని భాషల్లో తనదైన వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ దూసుకుపోతుంది. మరోవైపు అద్భుతమైన కంటెంట్ తో పాటు వివిధ భాషల్లో సినిమాలతో తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ గా రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ 1940, 70 కాలాల్లో జరిగిన ఇతివృత్తం నేపథ్యంలో తెరకెక్కించారు. మొత్తంగా 1940 నుంచి 70 మధ్య కాలం నాటి కాస్ట్యూమ్స్ , సెటప్స్ తో పాటు అప్పటి ప్రజలు మాట్లాడే భాష, యాస, లుక్స్, లైటింగ్, వర్కింగ్ మూడ్ వంటివి టీమ్ ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకొని తెరకెక్కించారు.
ఈ సందర్బంగా రామ్ తాళ్లూరి మాట్లాడుతూ..
నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ.. ‘ఈ కథను నాకు సాయి తేజ్ నాకు రెండేళ్ల ముందే చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు ఫీచర్ ఫిల్మ్ అనుకున్నాం. కానీ జీ5 వల్ల ఇది వెబ్ సిరీస్‌లా మారిందన్నారు. అద్భుతంగా ఈ వెబ్ సిరీస్‌ను జీ5 ఎంతో సాహోసోపేతంగా నిర్మించింది. కంటెంట్ చూసి నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. దర్శకుడు ప్రదీప్‌కు ఈ వెబ్ సిరీస్ మంచి పేరు తీసుకొస్తోందన్నారు. ఇందులో అందరు చాలా అద్బుతంగా నటించారు.
నరేష్ అగస్త్య మాట్లాడుతూ.. ‘జీ5లో నేను పసుపు కుంకుమ సీరియల్ చేశాను. ఇప్పుడు లీడ్‌గా వెబ్ సిరీస్‌లు చేయడం మర్చిపోలేని అనుభతి అన్నారు. రామ్ తాళ్లూరి గారితో పని చేయడం హ్యాపీగా ఉందన్నారు. దేశ్ రాజ్ పట్టు పట్టి నాకు ఈ పాత్రను ఇచ్చారు. పరువు వెబ్ సిరీస్ చూసి నన్ను అనుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
మేఘా ఆకాష్ మాట్లాడుతూ.. ‘సాయి తేజ ఈ కథను అద్భుతంగా రాశాను. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రదీప్ కి ధన్యవాదాలు. వికటకవి నవంబర్ 28న జీ5లో రాబోతోందంటూ చెప్పుకొచ్చారు.
దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ.. ‘సర్వం శక్తిమయం తరువాత ఏ ప్రాజెక్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. ఆ టైంలో రామ్ తాళ్లూరి ని కలిసి ఈ స్టోరీ వినిపించాను. నాకు అద్భుతంగా నచ్చింది. ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న కంటెంట్. అద్భుతమైన టీం సెట్ అయింది. అందుకే వికటకవి వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది.
దర్శక, రచయిత బీవీఎస్ రవి మాట్లాడుతూ.. ‘‘వికటకవి’లో నాలుగు ఎపిసోడ్స్ ఆల్రెడీ చూశాను. అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు తప్పుకుండా నచ్చుతుందనే ఆశాభావ వ్యక్తం చేశారు. సంగీతం, కెమెరా వర్క్, క్యాస్టూమ్ ఇలా అన్ని అద్భుతంగా కుదిరాయి. అజయ్ మ్యూజిక్ అదిరిపోయింది. నరేష్, మేఘా ఆకాష్ నటన ప్రేక్షకులను ఆకట్టుకోవడం గ్యారంటీ అన్నారు.
జీ5 కంటెంట్ హెడ్ సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘రామ్ తాళ్లూరి ప్రోత్సాహం వల్లే నేను వికటకవి లాంటి స్టోరీలు రాయగలిగాను. ఈ కథను చెప్పేందుకు జీ5కి వెళ్లాను. కానీ వాళ్లు నన్ను కంటెంట్ హెడ్‌గా ఉండమని చెప్పారు. ఈ కథ ఓకే అయ్యాక డైరెక్టర్ గురించి చర్చలు జరిగాయి. నేను ప్రదీప్ మద్దాలి పేరు చెప్పడంతోనే అంతా ఒప్పేసుకున్నారు. ఆయన ది బెస్ట్ ఇస్తారని అంతా నమ్మాం. ఇచ్చిన బడ్జెట్‌లో అద్భుతమైన క్వాలిటీ ఇచ్చే కెమెరామెన్ కోసం చూశాం. షోయబ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. అజయ్ బీజీఎం అదిరిపోయింది. కిరణ్ ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉందన్నారు. నరేష్ అగస్త్య తెలంగాణ షెర్లాక్ హోమ్‌లా అనిపిస్తుంది. నవంబర్ 28న జీ5లో మా వెబ్ సిరీస్ రాబోతోంది. అందరూ తప్పక చూసి ఆదరించండి.
జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ.. ‘సాయి చెప్పిన స్టోరీ మాకు చాలా నచ్చింది. క్లైమాక్స్ ఊహించలేకపోయామన్నారు. రామ్ గారి వల్ల ఈ ప్రాజెక్ట్ మరింత పై స్థాయికి వెళ్లిందన్నారు. ఈ సిరీస్ హాట్ టాపిక్ కానుంది. జీ5లో నవంబర్ 28న మా సిరీస్ రాబోతోంది. అందరూ చూడండన్నారు. .
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter