Vinayakachavithi Celebrations: మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ఇంట్లో ఘనంగా గణేష్ ఉత్సవాలు జరిగాయి. ఈ పండుగ మెగా ప్యామిలీకి చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే మెగా వారసురాలు ‘క్లీన్‌ కార’ పుట్టిన తర్వాత వచ్చిన తొలి వినాయక చవితి(Vinayaka chavithi) పండుగ ఇది. ఈ సందర్భంగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. 'ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్థిస్తున్నానంటూ' ఇంట్లో జరుపుకున్న గణేష్ పండగ సెలబ్రేషన్స్‌ ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు చిరు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులకు క్లీన్‌ కార’ పుట్టింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చిరంజీవి కళ్యాణ్ కృష్ణ కురసాలతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. చిరు పెద్ద కుమార్తే సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మూవీ తర్వాత బింబిసార ఫేమ్  వశిష్టతో సినిమా చేయనున్నారు మెగాస్టార్. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా కథ మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని టాక్ వినిపిస్తోంది. ఇందులో నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో గానీ ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. 



మరోవైపు రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీలో కియారా ఆద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ లీకైంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో కూడా ఓ సినిమా చేస్తున్నాడు చరణ్. ఇది స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది.


Also Read: Ganesh Chathurthi: వెంకీమామా 'సైంధవ్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook