Vishwambhara: ‘భోళా శంకర్’ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి.. కథల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా రీమేక్ కథలను పూర్తిగా పక్కనపెట్టి డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ కు ‘బింబిసార’ వంటి సాలిడ్ హిట్ అందించిన వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తోనే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ పూర్తైయింది. ఇక మెగాస్టార్ చిరంజీవి డబ్బింగ్ కూడా పూర్తి చేసినట్టు సమాచారం. కొన్ని గ్రాఫిక్స్ సన్నివేశాలతో పాటు ప్యాచ్ వర్క్ మిగిలి ఉంది. త్వరలోనే ఫస్ట్ కాపీ రెడీ చేయనున్నారు. అందులో ఏమైనా తేడాలుంటే రీ షూట్స్ కానీ.. కొన్ని సీన్స్ యాడ్ చేయడం వంటివి చేయనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ రోజు చిరంజీవి బర్త్ డే సందర్బంగా ‘విశ్వంభర’ సినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.  చేతిలో త్రిశూలం పట్టుుకొని అందులోంచి ఏదో అద్భుత శక్తి హీరోలకి ప్రవేశించేలా ఈ అప్ డేట్ ఉంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


‘విశ్వంభర’ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఇక చిరంజీవి కెరీర్ లో ‘యముడికి మొగుడు’ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తర్వాత చేస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ కావడం విశేషం. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మెగాస్టార్ చిత్రానికి కీరవాణి బాణీలు అందిస్తున్నారు. గతంలో ‘ఘరానా మొగుడు’, ‘ఆపద్భాందవుడు’, ‘ఎస్పీ పరశురాం’ సినిమాల తర్వాత ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నారు.


ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇక ‘స్టాలిన్’ మూవీ తర్వాత చిరు సరసన త్రిష కథానాయికా నటిస్తోంది. మరోవైపు యంగ్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంతో పాటు అన్నా చెల్లెల్ల సెంటిమెంట్ కూడా బలంగా ఉందట. ఇక ఈ సినిమాతో చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడా లేదా అనేది చూడాలి.


ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..


ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి