కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతూనే ఉంది. మొన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇవాళ ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్. అటు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం, మరోవైపు ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా (Choreographer)పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి శివశంకర్ మాస్టర్. కరోనా(Coronavirus)సోకడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శివశంకర్ మాస్టర్ రోజురోజుకూ క్షీణిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్ సోకిందని వైద్యులు వెల్లడించారు. పేరు ప్రఖ్యాతులున్న కొరియోగ్రాఫర్ అయినా సరే..ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారు కుటుంబసభ్యులు. చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతుండటంతో..స్థోమత లేక దాతల సహాయం కోసం ఆ కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు. 


జాతీయ అవార్డు గ్రహీత అయిన శివశంకర్ మాస్టర్(Siva Shankar Master)ఎక్కువగా తమిళ సినిమాలకు కొరియోగ్రఫీ అందించారు. నాలుగుసార్లు తమిళనాడు స్టేట్ అవార్డు అందుకున్నారు. మగధీర సినిమాలో(Magadheera Movie) ధీర..ధీర పాటకు 2011లో జాతీయ అవార్డు లభించింది. కొరియోగ్రాఫర్‌గానే కాకుండా దాదాపు 30 సినిమాల్లో నటించారు కూడా. టీవీల్లో డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు. 


Also read: Malaika Arora latest pics: యోగా కోసం వెళ్తున్న మలైకా అరోరా ఫోటోస్ చూశారా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook