Acharya Movie Release Date: తెలుగు సినీ ప్రేక్షకుల రేంజ్ మారిపోయిందా.. ప్రేక్షకులకు సినిమాలపై అంచనాలు పెరిగి పోయాయా..  ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్లుగా నిలిచిన సినిమాలు చూశాక మామూలు సినిమాలకు కాలం చెల్లిందనే వాదన బలపడుతోందా ? అసలు సినిమాలపై ప్రేక్షకుల అంచనాలు ఏ  స్థాయికి చేరాయి?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కాలంలో విడుదలైన సినిమాలు ప్రేక్షకులకు అద్భుతమైన దృశ్యకావ్యాలు చూసే అవకాశం కల్పించాయి. ముఖ్యంగా తెలుగు సినిమాలకు సంబంధించి.. బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అనే రేంజ్‌కు తెలుగు సినిమాను తీసుకెళ్లాడు జక్కన్న. అదే దర్శకుడు రాజమౌళి.. తెలుగు స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా తెరకెక్కించిన ప్యాన్‌ ఇండియా లెవల్ మూవీ ఆర్ఆర్ఆర్. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించి తక్కువ సమయంలోనే వెయ్యి కోట్లు వసూళ్లు సాధించిన మూవీగా ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డులకెక్కింది. ఆర్ఆర్ఆర్ ఆద్యంతం యాక్షన్‌, డ్రామాతో ప్రేక్షకులను అబ్బురపరిచింది. ప్రతి దృశ్యం పరవశం కలిగించేలా తెరకెక్కించాడు రాజమౌలి. ఈ మూవీ సైతం ప్రేక్షకుల స్థాయిని మరింత పెంచేసింది.


ఆర్‌ఆర్ఆర్ తర్వాత భారీ అంచనాలతో విడుదలై బాక్సాఫీస్‌ను ఆ స్థాయిలో షేక్ చేసిన మరో దక్షిణాది సినిమా కేజీఎఫ్‌. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్‌ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఇటీవల విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.  ఈ మూవీలో హీరోయిజం చూసిన ప్రేక్షకులు.. సినిమా అంటే ఇదిరా.. అనే లెవల్లో రెస్పాన్స్ వచ్చింది. అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో అంతే అద్భుతమైన స్క్రీన్ ప్లేతో వెండితెరను మురిపించారు నీల్,యష్. ఈ సినిమా చూసిన ప్రేక్షకులపై చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది కేజీఎఫ్. సినిమా కేవలం కథ మాత్రమే కాదు.. ప్రతి ఫ్రేమ్‌లో రిచ్‌నెస్‌ కోరుకునే స్థాయికి చేరుకున్నారు సగటు ప్రేక్షకులు.


ప్రేక్షకులు భారీ అంచనాలతో థియేటర్‌లోకి వస్తున్న ఈ టైమ్‌లో అమేజింగ్ స్టార్‌ కాస్ట్‌తో వస్తున్న టాలీవుడ్ మల్టీ స్టారర్ ఆచార్య. ఏప్రిల్ 29న రిలీజ్ కానున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. తండ్రీ కొడుకులిద్దరి కాంబోలో వస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీని.. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. ఇప్పటికే సినిమాలపై హైఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు మన ఆడియెన్స్. అయితే.. ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2 లాంటి చిత్రాలు చూసిన ప్రేక్షకుల అంచనాలను ఆచార్య (Acharya Movie) అందుకుంటుందా? ఆ చిత్రాల స్థాయిలో ఆచార్య విజువల్‌ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ టెక్నిక్స్‌తో సగటు ప్రేక్షకుడి అంచనాలను కొరటాల అందుకుంటాడా లేదా అనే చర్చ జరుగుతోంది.


also read : Nazriya Nazim: నజ్రియా నజీమ్‌ కోసం చాలామంది ట్రై చేశారు.. నాని ఆసక్తికర వ్యాఖ్యలు!


also read : AVAK Trailer: మేం తెలంగాణోల్లం.. మాకు మర్యాదొక్కటి సరిపోదు! మటన్ ముక్క కూడా గావాలి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook