AVAK Trailer: మేం తెలంగాణోల్లం.. మాకు మర్యాదొక్కటి సరిపోదు! మటన్ ముక్క కూడా గావాలి

Ashoka Vanam Lo Arjuna Kalyanam Movie Trailer out. అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో మేక‌ర్స్ ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. విశ్వ‌క్‌ సేన్ బస్సులోంచి చూస్తున్న సన్నివేశంతో ట్రైలర్‌ ఆరంభం అవుతుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2022, 07:26 PM IST
  • అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం ట్రైలర్‌
  • మేం తెలంగాణోల్లం.. మాకు మర్యాదొక్కటి సరిపోదు
  • 36 ఏళ్లకు పెళ్లి చేసుకుంటే క్రైమా?
AVAK Trailer: మేం తెలంగాణోల్లం.. మాకు మర్యాదొక్కటి సరిపోదు! మటన్ ముక్క కూడా గావాలి

Vishwak Sen, Ruskhar Dhillon starrer Ashoka Vanam Lo Arjuna Kalyanam Movie Trailer out: 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' సినిమాతో మంచి ఇమేజ్ సంపాదించుకున్న యువ హీరో విశ్వ‌క్‌ సేన్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. విశ్వ‌క్ సేన్ న‌టిస్తోన్న తాజా చిత్రాల్లో 'అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం' ఒకటి. విద్యాసాగ‌ర్ చింత దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించారు. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఏవీఏకే సినిమా చివరకు మే 6న విడుదలకు సిద్ధంగా ఉంది. 

అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండడంతో మేక‌ర్స్ ట్రైలర్‌ను విడుద‌ల చేశారు. విశ్వ‌క్‌ సేన్ బస్సులోంచి చూస్తున్న సన్నివేశంతో ట్రైలర్‌ ఆరంభం అవుతుంది. 'రాసేసుంటది.. మొత్తం రాసేసుంటది స్క్రిప్ట్', 'అంటే ఎంగేజ్‌మెంట్ క‌దండి..గెట‌ప్ ఛేంజ్ చేశా', 'మా సూర్యాపేట‌లో మొత్తం ఒక్క‌టే టాపిక్‌.. అర్జున్ కుమార్ అల్లం గాడికి పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు', 'కుదిరింది కుదిరింది పెళ్లి.. ముడ్డికింద 30 వచ్చాక' అనే డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 

'గోదారోళ్లమండీ..ఏం పెట్టినా మ‌ర్యాద‌గానే పెడ‌తాం', 'మేం తెలంగాణోల్లం.. మాకు మర్యాదొక్కటి సరిపోదు. మటన్ కూడా గావాలి', 'ఎవరైనా నన్ను ఎందుకు చేసుకుంటారు.. సూర్యాపేట‌లో వ‌డ్డీ వ్యాపారం చేసుకునే ఓ యావరేజ్ గాన్ని నేను', '36 ఏళ్లకు పెళ్లి చేసుకుంటే క్రైమా?.. తీసుకెళ్లి జైల్లో వేస్తారా? నన్ను' అనే డైలాగ్స్ చాలా చాలా కొత్త‌గా ఉన్నాయి. ప్రతిఒక్కరు ఈ డైలాగ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. స్క్రిప్టు అనే వాయిస్‌ ఓవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అశోక వ‌నంలో అర్జుణ క‌ల్యాణం సినిమా ట్రైలర్‌ కామెడీ, ఎమోషన్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంది. సూర్యాపేట‌లో వ‌డ్డీ వ్యాపారం చేసుకునే యువ‌కుడు.. గోదావ‌రి జిల్లా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వెళ్తాడు. సంబంధం కుదిరిన‌ట్టే కుదిరి.. పోతుంది. ఇంత‌కీ అర్జున్ కుమార్ అల్లంకు పెళ్ల‌యిందా.? లేదా? అన్నదే సినిమా కథ. ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రుష్క‌ర్ ధిల్లాన్ నటించారు. జై క్రిష్‌ సంగీతం అందించిన పాటలకు మంచి స్పందన లభించింది.  

Also Read: Ketika Sharma: కేతిక శర్మ హాట్ సెల్ఫీ.. అందాలన్నింటినీ బంధించేసింది!

Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో మరో ప్లేయర్‌కు కరోనా పాజిటివ్.. నేటి మ్యాచ్‌‌ వాయిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News