Ustaad Bhagat Singh first schedule పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్ కాంబోలో సినిమా కోసం అభిమానులు ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వస్తుందా? అని అంతా ఎదురుచూశారు. మొత్తానికి ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఫస్ట్ షెడ్యూల్ దాదాపు వారానికి పైగా నడిచింది. ఎనిమిది రోజుల పాటుగా చేసిన ఈ షూటింగ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను కంప్లీట్ చేసినట్టుగా సమాచారాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో హీరోయిన్‌కి కూడా ఈ సినిమాలో చాన్స్ ఉందన్న సంగతి తెలిసిందే. ఎనిమిది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్‌లో మేకర్స్ పలు కీలక సన్నివేశాలను షూట్ చేశారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్ల పర్యవేక్షణలో పవన్ కళ్యాణ్, వెయ్యి మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారు.


ఇదే షెడ్యూల్‌లో శ్రీలీల సైతం జాయిన్ అవ్వగా.. అలాగే రొమాంటిక్ సన్నివేశాలను, భారీగా రూపొందించిన పోలీస్ స్టేషన్ సెట్‌లో మరికొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. శ్రీలీల తో పాటు నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర, గిరి, టెంపర్ వంశీ, నవాబ్ షా, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో సందడి చేశారు.


Also Read:  Taapsee Pannu Bikini : బికినీలో తాప్సీ సెగలు.. పింక్ బ్యూటీ మిర్రర్ సెల్ఫీ వైరల్


గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్‌ హరీష్‌ శంకర్ కాంబినేషన్‌తో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించి అలరిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. దర్శకుడు హరీష్ శంకర్ ప్రీ-ప్రొడక్షన్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ సినిమా కోసం అదిరిపోయే డైలాగ్స్, స్పెల్-బైండింగ్ మ్యానరిజమ్‌లతో పవన్ కళ్యాణ్‌ను విభిన్న కోణంలో చూపించబోతోన్నాడట. గబ్బర్ సింగ్ వంటి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మరోసారి అలరిచేందుకు రెడీ అవుతున్నాడు.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook