Sammathame Teaser out: యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటిస్తున్న తాజా చిత్రం సమ్మతమే. కలర్‌ ఫొటో ఫేమ్‌ చాందిని చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా గోపీనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యు.జి.ప్రొడక్షన్స్‌ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను (Sammathame teaser) ఇవాళ విడుదల చేశారు మేకర్స్. పెళ్ళికి ముందు ప్రేమ అనేది నాకు పడదండి..అందులో నేడు పడను అంటూనే ప్రేమలో పడిన యువకుడు.. చివరికి ఆ అమ్మాయి ప్రేమను దక్కించుకున్నాడా..? లేదా అనేది కథ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీజర్ నిండా లవ్ సీన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇందులో కిరణ్‌, చాందిని చౌదరి మధ్య కెమిస్ట్రీ అదిరింది. ఇక ఈ సినిమాలో కిరణ్‌ బాలయ్య అభిమానిగా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తానికి టీజర్ సమ్మతంగానే ఉంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 24న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే  ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రంతో కిరణ్ మరో హిట్ కొడతాడో లేదో వేచిచూడాలి. 



Also Read: Acharya: 'చిరు', 'చిరుతకు' కూడా దక్కని అభిమానం.. రియల్ హీరోకి పూజలు, మామూలుగా లేదుగా 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook