Jr NTR: జూ. ఎన్టీఆర్ మరో ఘనత.. టాప్-50 ఆసియా నటుల జాబితాలో తారక్ కు చోటు..
Junior NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరో ఘనతను సాధించాడు. టాప్ 50 ఆసియా నటుల జాబితాలో తారక్ చోటు దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ ను పాపులర్ ఏషియన్ వీక్లీ’ మ్యాగజైన్..ఈస్టర్న్ ఐ 2023 పేరిట రిలీజ్ చేసింది.
Jr Ntr achieved another milestone: ఆర్‌ఆర్‌ఆర్‌తో గ్లోబల్ లెవల్లో పాపులర్ అయిన నటుడు జూ.ఎన్టీఆర్. తాజాగా తారక్ మరో ఘనతను సాధించాడు. పాపులర్ ఏషియన్ వీక్లీ’ మ్యాగజైన్..ఈస్టర్న్ ఐ 2023 పేరిట టాప్ 50 ఆసియా నటుల జాబితాను ప్రకటించింది. ఇందులో ఎన్టీఆర్ స్థానం దక్కించుకున్నాడు. ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ 25వ స్థానంలో నిలిచారు. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఈ ఘనతను సాధించిన ఏకైక నటుడిగా ఎన్టీఆర్ గుర్తింపు పొందాడు. ఇక ఈ లిస్ట్‌లో షారుక్ మొదటి స్థానంలో ఉన్నాడు. రీసెంట్ గా తారక్ ఆస్కార్ కమిటీలో సభ్యుడిగా కూడా స్థానం సంపాదించాడు. అంతేకాకుండా అమెరికన్ మ్యాగజైన్ ‘వెరైటీ’ ప్రకటించిన 500 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఎన్టీఆర్, రాజమౌళి చోటు దక్కించుకున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర’లో నటిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తారక్ జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ చిత్రం రెండు పార్టులుగా రాబోతుంది. తొలి భాగం భాగం 2024 ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.
దేవర జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల గోవాలో ఓ షెడ్యూల్ ను పూర్తిచేసుకుని వచ్చింది మూవీటీమ్. ఈ మూవీ టీజర్ ను క్రిస్మస్ లేదా సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే అవకాశం ఉందని ఫిలింవర్గాల టాక్. దీనికి గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని వార్తలు నెట్టింట చక్కెర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో రమ్యకృష్ణ ఓ కీలకపాత్రలో నటించనున్నారట. అది కూడా ఎన్టీఆర్ అత్తగా. అయితే వీరిద్దరూ గతంలో నా అల్లుడు సినిమాలో ఇలాంటి క్యారెక్టర్సే ప్లే చేశారు.
Also Read: Fighter: ఫైటర్ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన హృతిక్-దీపిక కెమిస్ట్రీ
మరోవైపు తారక్ అక్క పాత్రలో మంచులక్ష్మీ కనిపించనుందని సమాచారం. ఈ వార్త కూడా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. త్వరలో దీనిపై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఎలాగైనా అనుకున్న డేట్ కే మూవీని తీసుకురావాలని మేకర్స్ తెగ కష్టపడుతున్నారట. ఈ మూవీ సముద్ర నేపథ్యంలో తెరకెక్కుతోంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ కూడా భారీగానే ఉండనుందని టాక్. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఈ సెట్స్ డిజైన్ చేస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు. మరోవైపు ఈ చిత్రంతోపాటు వార్2’(War 2) లోనూ నటిస్తున్నాడు తారక్. ఇందులో హృతిక్ రోషన్ హీరోగా.. ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నారు.
Also Read: Oscar Shortlist: ఆస్కార్ రేసు నుంచి '2018' ఔట్.. డైరెక్టర్ పోస్ట్ వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook