Fighter: ఫైటర్ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన హృతిక్-దీపిక కెమిస్ట్రీ

Ishq Jaise Kuch: ప్రస్తుతం బాలీవుడ్ ప్రేక్షకులు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న సినిమా ఫైటర్. బాలీవుడ్ ప్రేక్షకులే కాదు పాన్ ఇండియా ప్రేక్షకులందరికీ ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇందుకు ముఖ్య కారణం ఈ చిత్రాన్ని వార్, పఠాన్ లాంటి సినిమాలు తీసిన దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తెరకెక్కించడం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 22, 2023, 06:34 PM IST
Fighter: ఫైటర్ నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్.. అదిరిపోయిన హృతిక్-దీపిక కెమిస్ట్రీ

Fighter Second Single: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా, దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఫైటర్. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు.. పాటలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. వార్, పఠాన్ సినిమాల‌ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తూ ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం రిలీజ్ దగ్గర పడుతూ ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరు పెంచారు ఈ చిత్రమే.

ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్ అలానే ఫస్ట్ సింగల్ రిలీజ్ చేశారు. రెండిటికి కూడా ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి రొమాంటిక్ సెకండ్ సింగిల్ ఇష్క్ జైసా కుచ్ పాటను విడుదల చేశారు. చాలా క్యాచీగా ఉండే ఈ పాత ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ పాటలో హృతిక్ రోషన్, దీపికా పదుకొణె ఫుల్ రొమాటింక్ మోడ్‌లో ఉండ‌గా.. వారిద్ద‌రీ కెమిస్ట్రీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ మధ్యనే విడుదలైన వీరిద్దరి పోస్టర్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక హృతిక్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. మరోసారి తన డాన్స్ సత్తా ని చూపిస్తూ ఈ సాంగ్ లో హృతిక్ రోషన్ స్టెప్పులు అందరిని ఫిదా చేశాయి . 
అంతేకాకుండా ఈ సాంగ్ హృతిక్ పాటల్లో వన్ ది బెస్ట్ అవ్వనుందని అంటున్నారు. దీపిక కూడా అదరగొట్టేసిందని కామెంట్లు చేస్తున్నారు .

ఇక ఈ సినిమాలో హృతిక్ రోషన్ స్క్వాడ్రన్ లీడర్ షంషేర్ పఠానియా (పాటీ)గా క‌నిపించ‌నుండ‌గా.. స్క్వాడ్రన్ లీడర్‌ మిన్నిగా (దీపికా పదుకొనే)గా కనిపించనున్నారు. సాధారణంగా కందల వీరుదు హృతిక్‌ రోషన్ అంటేనే అమ్మాయిలు పడి చస్తారు. దీపికా పదుకొణెకు పాన్ ఇండియా రేంజ్ లో ఏ స్థాయిలో అభిమానులు ఉంటారో మనకు తెలిసిందే. ఇక అలాంటి ఈ ఫేమ స్ ఇద్దరు కలిసి ఇలాంటి ఒక రొమాంటిక్ సాంగ్ చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అందరి దృష్టి పడిందని బీటౌన్ లో టాక్.

కాగా ఈ సినిమాని  వయాకామ్ 18 స్టూడియోస్, మార్ ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలపై మమతా ఆనంద్, రామన్ చిబ్, అంకు పాండే నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also read: CM Revanth Reddy Tour: ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన, మోదీని కలిసే అవకాశం, త్వరలో కేబినెట్ విస్తరణ

Also read: SRH New Captain: ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ మార్పు ? అందుకే అతడిని అంత ధరకు కొనుగోలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News