NTR Movie Update: మూడు సంవత్సరాల పాటు ఆర్.ఆర్.ఆర్ సినిమాకే అంకితమైపోయిన ఎన్టీఆర్.. ఇప్పుడు రిలాక్స్ అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాని మొదలు పెట్టబోతున్నారు. మరో పక్క ఉప్పెన డైరెక్టర్‌ బుచ్చిబాబు ఓ స్పోర్ట్ డ్రామా స్క్రిప్ట్ రాసుకొని ఎన్టీఆర్‌తోనే సినిమా తీయాలని పట్టుదలగా ఉన్నారు. దీనికి 'పెద్ది' అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఉప్పెన తర్వాత ఎన్ని అవకాశాలు వచ్చినా.. వాటిని పక్కన పెట్టి తన తదుపరి సినిమాని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తోనే తీయాలని ఫిక్సయిపోయారు. 1980లో జరిగిన స్టోరిగా పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమా సారాంశం ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్టీఆర్‌కి ఈ స్టోరి అంటే చాలా ఇష్టం. తాను ఈ సినిమాలో నటించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారని టాక్. అయితే ఈ స్టోరి దగ్గర ఓ హై రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. స్టోరి డిమాండ్‌ను బట్టి.. కొన్ని సీన్స్‌లో కథానాయకుడు దివ్యాంగుడిగా కనిపించాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇమేజ్‌కు అది సెట్‌ అవుతుందా లేదా అనేది అందరిలోనూ సందేహం నెలకొంది. ఇప్పుడు అదే డౌట్ ఎన్టీఆర్‌కు వచ్చిందని సమాచారం. స్టోరిలో ఆ భాగం అత్యంత కీలకం. దాన్ని పక్కన పెట్టడానికి ఛాన్స్‌ లేదు. దివ్యాంగుడిగా సీన్స్ చేస్తే తన ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే డౌట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను పట్టి పీడిస్తోందని ఇన్ సైడ్ వర్గాల సమాచారం. 


అలా అని ఈ సినిమాను వదలుకోడానికి ఎన్టీఆర్ ఇష్టపడడం లేదంట. అందుకే ఈ చిత్రం ఆలస్యం అవుతుందని సమాచారం. ఉప్పెనలో సినిమాలో కూడా ఇలాంటి హై రిస్క్ ఎలిమెంటే ఉంది. క్లైమాక్స్ మార్చమని చాలా మంది డైరెక్టర్ బుచ్చిబాబు మీద ఒత్తిడి తెచ్చారు. కానీ దాన్ని మార్చడానికి డైరెక్టర్ బుచ్చి బాబు అంగీకరించలేదు. సినిమాను ఆ క్లైమాక్స్‌తోనే రిలీజ్‌ చేశారు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. అయితే ఉప్పెన సినిమాకి..పెద్ది సినిమాకి తేడా ఏంటంటే.. వైష్ణవ్ తేజ్‌కు అది మొదటి సినిమా. దాని వల్ల వైష్టవ్ తేజ్‌కు ఎలాంటి ఇమేజ్ లేదు. కాబట్టి ఉప్పెనలో వర్కవుట్ అయింది.


కానీ ఇక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలా కాదు కదా.. టాలీవుడ్‌లో బెస్ట్ యాక్టర్‌గా మంచి క్రేజున్న హీరో. అలాంటి హీరోను పెద్ది సినిమాలో దివ్యాంగుడిగా చూపిస్తే అభిమానులు రెస్పాన్స్ ఎలా ఉంటుందనే డౌట్‌ అందరిలోనూ ఉంది. అయితే ఈ విషయంలో డైరెక్టర్ బుచ్చిబాబు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారని.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఆ విషయంపై ఒప్పించే ప్రయత్నం సాగిస్తున్నారని తెలుస్తోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన యన్టీఆర్.. ఇలాంటి పాత్ర చేస్తే హై రిస్కే అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. మరి యంగ్ టైర్ ఎన్టీఆర్ తన ఇమేజ్ గురించి చూస్తాడో లేక.. పాత్ర గురించి ఆలోచిస్తాడో వేచి చూడాలి. 


Also Read: Janhvi Kapoor Photos: షైనింగ్ డ్రస్సులో వజ్రంలా మెరిసిపోతున్న నటి జాన్వీ కపూర్!


Also Read: Sai Pallavi Farming: కూలీగా మారిన 'శ్యామ్ సింగరాయ్' మూవీ హీరోయిన్ - ఫొటోలు వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook