Y.V.S Chowdary: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కి..యాక్టర్స్ కి.. కేవలం సినిమాల వరకే ఫ్రెండ్షిప్ పరిమితం కాదు. మరి ముఖ్యంగా వైవీఎస్ చౌదరికి…నందమూరి కుటుంబంతో ఉన్న అనుబంధం ఎటువంటిదో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. పైగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అంటే వైవీఎస్‌కు ఎనలేని అభిమానం. చాలా సందర్భాలలో ఆయన రామారావు.. గురించి ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు. అంతేకాదు తన సినిమాని రామారావు ఫోటో చూపించకుండా.. మొదట పెట్టడం మనం ఎప్పుడూ చూసి ఉండం. అంటగా రామారావుని అభిమానిస్తారు ఈ డైరెక్టర్..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా..హరికృష్ణ, బాలకృష్ణలతో సినిమాలు తీసి హిట్టు సాధించిన వైవీఎస్ చౌదరి.. ఖాతాలో గత కొద్దికాలంగా మంచి హిట్టు పడలేదు. ఒకప్పుడు ఆయనకు టాలీవుడ్ లో పిచ్చ క్రేజ్ ఉండేది. ఆయన పరిచయం చేసిన హీరో, హీరోయిన్లు.. ఎంతో పాపులర్ అయ్యారు. రామ్ పోతినేని, ఇలియానా లాంటి సెలబ్రిటీలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది.. వైవీఎస్ అన్న విషయం అందరికీ తెలిసిందే.


సరికొత్త టాలెంట్ ని ప్రోత్సహించడంతోపాటు.. ప్రయోగాత్మకమైన చిత్రాలను తీయడంలో దిట్ట వైవీఎస్. ప్రస్తుతం ఆయన  ఎన్టీఆర్ (న్యూ టాలెంట్ రోర్స్) అనే బ్యానర్ పై సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ గారికి ఇష్టమైన మనవడు జూనియర్ ఎన్టీఆర్ కదా? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి వైవీఎస్ కాస్త ఘాటుగానే.. సమాధానం చెప్పారు. 


‘తారక రామారావు గారు ఎప్పుడు ఎక్కడ తనకు.. ఏ మనవడు.. ప్రత్యేకం అని చెప్పలేదు. ఆయన దృష్టిలో అందరూ సమానమే.. ఆయనకు ఇష్టమైన మనవడంటూ ఎవరూ లేరు’ అని  వైవీఎస్ అన్నారు. అంతేకాదు ఎన్టీఆర్కు ఆ పేరును హరికృష్ణ పెట్టుకున్నారని..వైవీఎస్ పేర్కొన్నారు. హరికృష్ణ తన ముగ్గురు కొడుకులకి జానకిరామ్, కళ్యాణ్ రామ్, తారక రామ్ అని పేరు పెట్టుకున్నారని ఆయన స్పష్టం చేశారు. అయితే గతంలో ఒక ఈవెంట్లు స్వయంగా హరికృష్ణ తన తండ్రి తన పేరుని.. ఎన్టీఆర్ కు పెట్టారని వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పై సోషల్.. మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.


 



Also Read: YS Viveka Murder Case: వైఎస్ జగన్ చెల్లెలు సంచలనం.. వైఎస్‌ వివేకా హత్యపై కీలక పరిణామం


Also Read: Andhra Pradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఇకపై ఆ నిబంధన ఉండదు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి