Zee Telugu Dance India Dance Auditions: జీ తెలుగు ముందు నుంచి అనేక రియాలిటీ షోలు నిర్వహించి తద్వారా సినీ పరిశ్రమకు సరికొత్త గాయనీ గాయకులను,  అనేక మంది డాన్స్ కొరియోగ్రాఫర్ లను అందించిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న జీ తెలుగు ఇప్పుడు ఒక సరికొత్త డాన్స్ రియాలిటీ షోతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు ప్రేక్షకులను అలరించడమే కాక వారిని కూడా భాగస్వాములను చేసేందుకు తాజాగా జీ తెలుగు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా పేరుగాంచిన 'జీ నెట్వర్క్'కు సంబంధించిన ప్రీమియం రియాలిటీ షో ''డాన్స్ ఇండియా  డాన్స్'' ఇప్పుడు తెలుగులో త్వరలో మీ ముందుకు రాబోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి ఈ షో ఇప్పటికే పలు భాషలలో నిర్వహించబడి అద్భుతమైన విజయాన్ని అందుకుని అనేకమంది ఉత్సాహవంతులకు బంగారు భవిష్యత్తును అందించింది. ఇప్పుడు,  ఈ అవకాశాన్ని తెలుగు ప్రేక్షుకులకు కూడా కల్పించేందుకు,  'జీ తెలుగు' సిద్దమయింది. అందులో భాగంగానే తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న అద్భుతమైన డాన్సర్స్ ని వెతికి పట్టుకునేందుకు ''డాన్స్ ఇండియా  డాన్స్'' ఆడిషన్స్ నిర్వహించబోతుంది. నిజానికి మిగతా భాషలతో పోలిస్తే "డాన్స్ ఇండియా డాన్స్ - తెలుగు" కాన్సెప్ట్ కాస్త భిన్నంగా ఉండబోతుంది. 


అదేమంటే 'జీ తెలుగు' వివిధ సాంస్కృతిక నేపధ్యాలు,   జీవనశైలి కలిగిన డాన్సర్స్ ను జూన్ 23 నుంచి విశాఖపట్నం,  విజయవాడ,  తిరుపతి,  కర్నూల్,  ఖమ్మం,  వరంగల్,  హైదరాబాద్ వంటి నగరాల్లో ఆడిషన్స్ నిర్వహించి వెతికి పట్టుకో నుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆడిషన్స్ లో వయో పరిమితులు లేవు,  డాన్స్ మీద ఆసక్తి ఉన్న 6 నుండి 60 సంవత్సరాల వయస్సు కలిగిన వారెవరైనా ఈ ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు.  ఇక "డాన్స్ ఇండియా డాన్స్ - తెలుగు" ఆడిషన్స్ జూన్ 23న వరంగల్ అలాగే ఖమ్మంలో,  జూన్ 24న కర్నూల్ అలాగే విజయవాడలో,  జూన్ 26న తిరుపతి అలాగే వైజాగ్ లో జరగనున్నాయి. 


అదేవిధంగా అక్కడికి వెళ్ళే అవకాశం లేని ఆశావహులు ఎవరైనా ఉంటే వారు డిజిటల్ ఆడిషన్స్ లో కూడా పాల్గొనే అవకాశం కల్పిస్తోంది జీ తెలుగు. ఆసక్తి ఉన్న వారు డాన్స్ వీడియో షూట్ చేసి 9154984009 నెంబర్ కి వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. లేదా did.zeetelugu@gmail.com కి ఇమెయిల్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండూ కాకుంటే కనుక 'didtelugu.zee5.com కు లాగిన్ అవ్వడం ద్వారా కూడా డ్యాన్స్ వీడియోలను పంపవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీ బంధు మిత్రులకు,  కూడా ఈ సమాచారాన్ని వెంటనే షేర్ చేసేయండి మరి. 


Also Read : Actor Naresh: వార్తలపై స్పందించిన నరేష్... పద్దతి కాదంటూ వివరణ


Also Read : Cinema Shootings Bundh: తెలుగు సినిమాలకే కాదు.. ఇతర భాషల సినిమాలకూ తప్పలేదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook