Actor Naresh: వార్తలపై స్పందించిన నరేష్... పద్దతి కాదంటూ వివరణ

Actor Naresh Releases a video : ఫిలిం ఫెడరేషన్ వర్కర్స్ సమ్మెకు పిలుపునిచ్చిన నేపధ్యంలో పెద్ద ఎత్తున ఉద్రిక్తత నెలకొంది. తాజాగా ఈ విషయం మీద నటుడు నరేష్ స్పందించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 22, 2022, 03:34 PM IST
  • సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన నరేష్
  • ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ సూచన
  • మునిగిపోతామంటూ ఫోన్లు వస్తున్నాయని వెల్లడి
Actor Naresh: వార్తలపై స్పందించిన  నరేష్... పద్దతి కాదంటూ వివరణ

Actor Naresh Releases a video: ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగ్లు అన్నీ నిలిచి పోయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల నుంచి పెంచకుండా ఉంచిన తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 24 క్రాఫ్ట్స్‌కు చెందిన కార్మికులు సినీ కార్మికులు ఫిల్మ్‌ ఫెడరేషన్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో 24 క్రాఫ్ట్స్‌కు చెందిన వందల మంది కార్మికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఫిల్మ్‌ ఛాంబర్‌ కల్పించుకుని తమ సమస్యలను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని వారు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్ బిల్డింగ్ వద్ద ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నం కూడా చేయడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు నరేష్ ఈ వ్యవహారం మీద స్పందించారు. 

ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ, నిన్నటి నుంచి టీవీలన్నీ మార్మోగిపోతున్నాయని, షూటింగులు ఆగిపోతాయని ఒకటీ రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని అన్నారు. అలా పోరాటం చేయడం మంచిది, పెద్దలందరూ కలిసి దాని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకుంటారని అన్నారు. కానీ, మనమందరం ఒకటి గుర్తుంచుకోవాలన్న ఆయన గత మూడు సంవత్సరాలుగా కరోనా మహమ్మారి బారినపడి ప్రపంచంతో పాటు సినీ పరిశ్రమ అట్టడుగుకు వెళ్లిపోయి కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు పూట కూటికి కూడా గతి లేకుండా ఎన్నో ఇబ్బందులు పడి మెడికల్ ఖర్చులకు కూడా లేకుండా ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారని గుర్తు చేశారు. 

కరోనా కారణంగా మూడు సంవత్సరాల పాటు ఇబ్బందులు పడిన తర్వాత పరిశ్రమ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటుందని నరేష్ చెప్పుకొచ్చారు. నెమ్మదిగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మంచి సినిమాల వల్ల తెలుగు సినీ పరిశ్రమకు మంచి పేరు వస్తుందని మనందరికీ కూడా బ్యాంకులు నిండకపోయినా కనీసం కంచాలు నిండుతున్నాయని చెప్పుకొచ్చారు. అయితే ఈ పరిస్థితుల్లో మనమందరం కూడా ఇలా చేయడం కరెక్టా కాదా అనేది ఆలోచించాలని అన్నారు. అన్నిటికీ పరిష్కారం ఉంటుంది, కానీ, ఇలా ఇవాళే ఆపండి, అంటే పద్ధతి కాదని ఆయన చెప్పుకొచ్చారు. 

చాలా మంది ఫోన్ చేస్తున్నారని, దర్శక నిర్మాతలు, జూనియర్ ఆర్టిస్టులు ఫోన్ చేసి ఇలా చేస్తే మునిగిపోతామమంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఇండస్ట్రీ బిడ్డగా కోరేదొక్కటేనన్న ఆయన వేతనాలు ఎంతో కొంత పెంచాలి, కానీ ఇలా పీక మీద కత్తి పెట్టినట్టు కాకుండా ఒక వారం లేదా పదిరోజులు సమయం తీసుకుని, ఫెడరేషన్‌, నిర్మాతలు కలిసి ఒక నిర్ణయానికి రావడం కష్టం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీ బిడ్డగా ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానన్న ఆయన పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుని.. సినీ పరిశ్రమ మరోసారి అంధకారంలోకి వెళ్లకుండా ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అనుకుంటున్నానని పేర్కొన్నారు.
Also Read: Cinema Shootings Bundh: తెలుగు సినిమాలకే కాదు.. ఇతర భాషల సినిమాలకూ తప్పలేదు!

Also Read: Akash puri: ఛార్మి కోసం పూరి విడాకులకు రెడీ.. అసలు విషయం బయట పెట్టేశాడుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News