NTR ఫ్యాన్స్‌పై నటి Meera Chopra ఫిర్యాదు
తనను రేప్ చేస్తానంటూ కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ బెదరిస్తుంటే, చంపేస్తామని మరికొందరు వార్నింగ్ ఇస్తున్నారని తన ఫిర్యాదులో నటి మీరా చోప్రా పేర్కొన్నారు. ఏపీ నుంచే ఈ బెదిరింపులు వస్తున్నాయని మరో ట్వీట్లో తెలిపింది.
అభిమానం హద్దులు మీరేలా చేస్తుంది. అయితే హద్దులు దాటితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తాజాగా చిట్ చాట్‌లో పాల్గొన్న హీరోయిన్ మీరా చోప్రా (Meera Chopra Trolls) తనకు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అంటే ఇష్టమని, తాను జూ. ఎన్టీఆర్ (Jr NTR)కు అభిమాని కాదని చెప్పడంతో వివాదం మొదలైంది. ఇక అది మొదలుకుని తారక్ అభిమానులు మీరా చోప్రాన్ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. దీనిపై నటి మీరా చోప్రా ఫిర్యాదు చేశారు. తనను రేప్ చేస్తా అని కొందరు బెదరిస్తుంటే, చంపేస్తామని మరికొందరు వార్నింగ్ ఇస్తున్నారని తన ఫిర్యాదులో మీరా చోప్రా పేర్కొన్నారు. గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్
అంతకుముందు మీ అభిమానులు పచ్చి బూతులు తిడుతున్నారు, స్పందించాలని ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వేధింపులు భరించలేక జాతీయ మహిళా కమిషన్‌కు, హైదరాబాద్ సిటీ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ నెటిజన్లపై చర్య తీసుకోవాలంటూ ట్విట్టర్‌ను సైతం ట్యాగ్ చేసింది. ఎంగేజ్‌మెంట్‌కు సాహో అంటున్న దర్శకుడు
నువ్వు పవన్ కల్యాణ్, మహేష్ బాబు ఫామ్ హౌస్‌లకు ఎన్నిసార్లు వెళ్లావో మాకు తెలుసు, నువ్వు వేశ్యవు.. నిన్ను గ్యాంగ్ రేప్ చేస్తామంటూ దారుణమైన కామెంట్లతో వేధించారు. ఆస్తులున్నోడితో పెట్టుకో, అధికారం ఉన్నోడితో పెట్టుకో కానీ మాస్ అభిమానులున్న హీరోతో మాత్రం పెట్టుకోవద్దంటూ పంచ్ డైలాగ్‌తో సైతం మీరా చోప్రాను బెదిరించారు. నీ రేటెంతో చెప్పు, నిన్ను మేం డీల్ చేస్తామంటూ అసభ్య పదజాలంతో ఎన్టీఆర్ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ ట్వీట్లు వస్తున్నాయని మరో ట్వీట్ చేసింది మీరా చోప్రా (Meera Chopra Complaint Againt NTR Fans). ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
కెరీర్ విషయానికొస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బంగారం సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది మీరా చోప్రా. ఆ తర్వాత వాన సినిమాతో హిట్ అందుకుంది. నితిన్‌కు జోడీగా మారో సినిమాలో నటించింది. అంతగా ఆకట్టుకోలేకపోయిన మీరా చోప్రా బాలీవుడ్‌వైపు అడుగులు వేసింది. తాజాగా ఆన్‌లైన్ చిట్‌చాట్ ఆమెకు తలనొప్పులు తీసుకొచ్చింది. వేధింపులు భరించలేక ఏకంగా పోలీసులను, జాతీయ మహిళా కమిషన్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి