ఎంగేజ్‌మెంట్‌కు సాహో అంటున్న దర్శకుడు

టాలీవుడ్ సెలబ్రిటీలకు లాక్‌డౌన్ బాగా కలిసొచ్చింది. నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు.

Updated: Jun 3, 2020, 11:44 AM IST
ఎంగేజ్‌మెంట్‌కు సాహో అంటున్న దర్శకుడు
Image Credit: Twitter

టాలీవుడ్ సెలబ్రిటీలకు లాక్‌డౌన్ బాగా కలిసొచ్చింది. నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్‌ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్  (Sujeeth) త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ఉన్న ఒక్కొక్కరు లాక్‌డౌన్‌లో తమ వ్యక్తిగత జీవితంపై ఫోకస్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు

జూన్ 10న సాహో డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం (Sujeeth Engagement) చేసుకుకోనున్నాడు. తన ప్రేయసి ప్రవల్లికతో వచ్చే వారం ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది.  పెద్దల అంగీకారం దొరకడంతో లాక్‌డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకో కాగా, ప్రవల్లిక వృత్తిరీత్యా డాక్టర్ అని సోషల్ మీడియాలో ఆమె పాపులర్ అని ప్రచారంలో ఉంది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తాజా సినిమా ‘లూసిఫర్’ రీమేక్ ప్రాజెక్టుతో సుజీత్ బిజీగా ఉన్నాడు.  గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్

తీసింది రెండు సినిమాలే అయినా సినీ పరిశ్రమలో సుజీత్ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్‌’తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుజీత్ రెండో సినిమా సాహో (Saaho) రెబల్ స్టార్ ప్రభాస్‌తో చేశాడు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తీశాడంటే సుజీత్‌పై నిర్మాత, హీరోకు అంత నమ్మకం. బాక్సాఫీసు వద్ద సాహో నిరాశపరిచినా పెట్టుబడిని వసూలు చేసింది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి