Bandla Ganesh : పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ అసంతృప్తి.. నిర్మాతగా సినిమా చాన్స్ ఇవ్వకపోవడంతో ట్వీట్ వేశాడా?
Bandla Ganesh Hurts on Pawan Kalyan బండ్ల గణేష్ తాజాగా పవన్ కళ్యాణ్ మీద తన అసంతృప్తిని ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. తాజాగా పవన కళ్యాణ్ కొత్త సినిమాను అనౌన్స్ చేసిన క్రమంలో బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Bandla Ganesh on Pawan Kalyan Sujeeth DVV Danayya Movie : బండ్ల గణేష్ గత రెండు మూడేళ్లుగా పవన్ కళ్యాణ్‌తో భారీ సినిమా తీయాలని ప్లాన్ చేస్తూనే ఉన్నాడు. తాను ఇకపై తీస్తే భారీ సినిమానే తీస్తానని, అది కూడా పెద్ద హీరోతోనే తీస్తాను అని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ మళ్లీ చాన్స్ ఇచ్చాడని, త్వరలోనే సినిమా తీస్తాను అన్నట్టుగా బండ్ల గణేష్ ఆ మధ్య ఓ ట్వీట్ కూడా వేశాడు. అందులో బండ్ల గణేష్.. తన దేవుడు పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేశాడు.
దీంతో బండ్ల గణేష్ మరో బ్లాక్ బస్టర్ తీయబోతోన్నట్టుగా అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను ప్రకటిస్తున్నాడు. అందులో ఏదీ సెట్స్ మీదకు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. అప్పుడెప్పుడో మొదలుపెట్టిన హరి హర వీరమల్లు మాత్రం ఇంత వరకు కంప్లీట్ కాలేదు. ఇక మైత్రీ హరిష్ మూవీ పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. రామ్ తాళ్లూరి చిత్రం కూడా రావాల్సి ఉంది. ఇక వినోదయ సిత్తం సినిమా రీమేక్ కూడా లైన్‌లో ఉంది.
ఇవన్నీ ఎప్పుడు స్టార్ అవుతాయో..ఎప్పుడూ కంప్లీట్ అవుతాయో ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి సమయంలో బండ్ల గణేష్ సినిమా ఏం వస్తుందని అంతా అనుకున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ఇంకా కొత్త సినిమాలను ఎందుకు ప్రకటిస్తారు అని అనుకున్నారు. కానీ సుజిత్ దర్శకత్వంలో దానయ్య నిర్మాతగా పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. దీనికి సంబంధించిన అప్డేట్ నిన్న వచ్చింది.
దీంతో బండ్ల గణేష్ హర్ట్ అయినట్టున్నాడు. తనకు మాత్రం నిర్మాతగా ఓ సినిమా చేసి పెట్టడం లేదని బండ్ల గణేష్ ఫీల్ అయినట్టున్నాడు. వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం , దాంతోపాటు ప్రసాదం కూడా తిందాం , లేకపోతే టైం వేస్ట్.. టైం ఎక్కువ లేదు.. మన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి అని చెప్పుకొచ్చాడు. దీంతో బండ్ల గణేష్ హర్ట్ అయినట్టుగా పవన్ కళ్యాణ్ సుజిత్ మూవీ మీద ఇలా పరోక్షంగా స్పందించాడని నెటిజన్లు అనుకుంటున్నారు.
కాసేపటికే బండ్ల గణేష్ మరో ట్వీట్ వేశాడు. పవన్ కళ్యాణ్ సుజిత్ దానయ్య సినిమా మీద స్పందించాడు. భారత చలన చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ చిత్రంగా నిలవాలని నిలిచే విధంగా రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బండ్ల గణేష్ అని ట్వీట్ వేశాడు.
Also Read : Rashmi Gautam in Bikini : బికినీలో యాంకర్ రష్మీ.. జబర్దస్త్ అందాల విందు.. పిక్స్ వైరల్
Also Read : Renu Desai Birthday : రేణూ దేశాయ్ బర్త్ డే.. కనిపించిన అకిరా నందన్.. క్లారిటీ ఇచ్చేసిందోచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook