Renu Desai Birthday : రేణూ దేశాయ్ బర్త్ డే.. కనిపించిన అకిరా నందన్.. క్లారిటీ ఇచ్చేసిందోచ్

Renu Desai Birthday రేణూ దేశాయ్ పుట్టిన రోజు (డిసెంబర్ 4)ని ఆద్య గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఇంట్లో పిల్లలు, సెట్స్‌లో చిత్రయూనిట్ ఆమె బర్త్ డేను సెలెబ్రేట్ చేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2022, 08:55 AM IST
  • రేణూ దేశాయ్ పుట్టిన రోజు
  • నెట్టింట్లో విషెస్‌ల వెల్లువ
  • అకిరా కనిపించకపోవడంపై క్లారిటీ
Renu Desai Birthday : రేణూ దేశాయ్ బర్త్ డే.. కనిపించిన అకిరా నందన్.. క్లారిటీ ఇచ్చేసిందోచ్

Akira Nandan in Renu Desai Birthday : అకిరా నందన్ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. రేణూ దేశాయ్ పోస్టుల్లో అకిరా నందన్ కనిపించినా కనిపించకపోయినా కూడా వార్తే అవుతుంది. ఇక పవర్ స్టార్ అభిమానుల కామెంట్ల తాకిడిని తట్టుకోలేక రేణూ దేశాయ్ అయితే కామెంట్ల సెక్షన్‌ను మూసి వేస్తుంటుంది. తాజాగా అకిరా నందన్ ఫోటోలను కనిపించీ కనిపించనట్టుగా రేణూ దేశాయ్ షేర్ చేసింది. హుడీ టైపులో ఉన్న డ్రెస్సును అకిరా వేసుకోడంతో మొహం కనిపించలేదు.

కానీ అకిరా మాత్రం గడ్డం, మీసంతో అదరగొట్టేశాడు. అకిరాను అలా చూడటంతో మెగా ఫ్యాన్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు తెగ సంబరమేసినట్టుంది. అకిరా నందన్ ఫోటోలు దిగడమే చాలా అరుదు. రేణూ దేశాయ్, ఆద్యలు ఫోటోలకు పోజులిస్తుంటారు. సెల్ఫీలు దిగుతుంటారు. కానీ అకిరా నందన్ మాత్రం ఫోటోల్లో ఎక్కువగా కనిపించడు. తన పని తాను, తన లోకం తాను అన్నట్టుగా ఉంటాడు అకీరా నందన్. తాజాగా అలాంటి ఘటనే జరిగింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

రేణూ దేశాయ్ బర్త్ డే (డిసెంబర్ 4)ని ఆద్య మరింత స్పెషల్‌గా చేసిందంటూ రేణూ దేశాయ్ పోస్ట్ వేసింది. అకిరా నందన్ కనిపించడం లేడు..ఎక్కడున్నాడు. ఏమైంది? అంటూ ఇలా నెటిజన్లు ఆరాలు తీయడం మొదలుపెట్టేశారు. దీంతో అందరికీ క్లారిటీ వచ్చేలా మరో పోస్ట్ వేసింది రేణూ దేశాయ్.

రేణూ దేశాయ్, ఆద్యలు సెల్ఫీలు తీసుకుంటూ బిజీగా ఉంటే.. బ్యాక్ గ్రౌండ్‌లో మాత్రం అకిరా నందన్.. బర్త్ డే సెలెబ్రేషన్‌లకు సంబంధించిన పనులను చూస్తూ బిజీగా ఉన్నాడట. ఈ విషయాన్ని రేణూ దేశాయ్ చెబుతూ వేసి, పోస్ట్ వైరల్ అవుతోంది. రేణూ దేశాయ్ బర్త్ డేను ఆద్య, అకిరా నందన్ కాకుండా టైగర్ నాగేశ్వరరావు చిత్రయూనిట్ కూడా గ్రాండ్‌గా సెలెబ్రేట్‌ చేసింది. సెట్స్‌లో రేణూ దేశాయ్ చేత కేక్‌ను కట్ చేయించి పుట్టిన రోజును సెలెబ్రేట్ చేశారు.

Also Read : Rashmika Mandanna Hot Photos: మ్యాగజైన్ కోసం రష్మిక హాట్ ఫోజులు.. చూశారా?

Also Read : Salman Khan Wig : సల్మాన్ ఖాన్ విగ్.. నెటిజన్ల ట్రోలింగ్.. ఆ లుక్కేంటి అంటూ కౌంటర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News