యాంకర్ శ్రీముఖిపై కేసు నమోదు
ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖికి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. case againt Anchor Sreemukhi
ప్రముఖ యాంకర్ శ్రీముఖికి ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ‘పటాస్’ యాంకర్ శ్రీముఖిపై నల్లకుంటకు చెందిన శర్మ అనే ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. భార్యను బెదిరించబోతే ప్రాణం పోయింది
పలు ప్రోగ్రామ్‌లకు యాంకర్‌గా శ్రీముఖి వ్యవహరించారు. నటిగానూ వెండితెరపై రాణిస్తున్నారు. ఈ క్రమంలో ఓ షోలో భాగంగా ఆమె మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజికవర్గాన్ని కించ పరిచేలా వ్యాఖ్యలు చేశారని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు శర్మ. తమను కించపరిచే వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ, తమ మనోభావాలు దెబ్బతిన్నాయని యాంకర్ శ్రీముఖితో పాటు సదరు టీవీ యాజమాన్యంపైనా శర్మ ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ‘శ్రద్ధ’ చూపుతోన్న చీర అందాలు
శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేయనున్నట్లు సమాచారం. కాగా, అల్లరితో యాంకరింగ్‌లో కొత్త ఒరవడి తీసుకొచ్చింది శ్రీముఖి. నటిగానూ రాణిస్తోంది. గతేడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని రన్నరప్‌గా శ్రీముఖి నిలవడం తెలిసిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!