Teddy Day 2020: మీ ప్రేమకు గుర్తుగా టెడ్డీ గిఫ్ట్.. హ్యాపీ టెడ్డీ డే!
వాలెంటైన్స్ వీక్‌లో భాగంగా నాలుగో రోజు సెలబ్రేట్ చేసుకునేదే ఈ Teddy Day. ఈరోజు మనకిష్టమైన వారికి టెడ్డీ ఇచ్చి ప్రేమను వ్యక్తం చేయవచ్చు.
ప్రేమలో ఉన్నవారికి ప్రతి రోజూ ఓ సెలబ్రేషన్‌లా ఉంటుంది. కానీ ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ఎందుకో తెలియదు కాని వారి మధ్య ప్రేమ రెట్టింపయినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే (ప్రేమికుల రోజు) వస్తుంది. వాలెంటైన్స్ డే మాత్రం ప్రేమికులకు ఇంకా ప్రత్యేకం. ప్రేమకు ప్రత్యేక మైన రోజు అక్కర్లేదని మనస్తత్వవేత్తలు చెబుతుంటారు. అయితే ప్రేమను వ్యక్తం చేసేందుకు, తమ మనసులోని భావాలను ఆరోజు ప్లాన్ చేసి తమకు తోచిన రీతిలో చెబుతుంటారు.
ప్రేమ పండుగ వారం రోజుల ముందుగానే ఫిబ్రవరి 7నే మొదలవుతుందని తెలిసిందే. ఫిబ్రవరి 7న ‘రోజ్ డే’తో మొదలుకుని ఫిబ్రవరి 14వరకు రోజూ ఓ ప్రత్యేకత ఉంది. నేడు టెడ్డీ డే. వాలెంటైన్ వీక్‌లో నాలుగో రోజైన ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డేని సెలబ్రేట్ జరుపుకుంటారు. సినిమాల్లో చూపించన విధంగానే నిజ జీవితంలోనే చాలా మంది యువతులు టెడ్డీ బొమ్మలంటే ఇష్టపడతారు. తమ ప్రియురాలికి కోపం వస్తే బుజ్జగించడానికో, లేక ఆమె మనసులో చోటు సంపాదించడానికే చేసే ప్రయత్నాల్లో టెడ్డీ బియర్స్ లాంటివి ఇస్తుంటారు. ఇలా ఇచ్చే టెడ్డీలు వారికి ఇంట్లో, రూములో ఉండే సమయంలో తమకు ఆ గిఫ్ట్ ఇచ్చిన వారిని గుర్తు చేస్తాయట. కుటుంసభ్యులు టెడ్డీని ఇచ్చినా, వారు తమపై ఎంత ప్రేమను చూపిస్తున్నారో తరచుగా గుర్తు చేసుకుంటారు.
Also Read: మీ ప్రేమను ఇలా తెలపడం బెటర్!
ఫిబ్రవరి 7న రోజ్ డేతో మొదలయ్యే ఈ లవ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 14వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఫిబ్రవరి 8న ప్రపోజ్ డే, ఫిబ్రవరి 9న చాక్లెట్ డే, ఫిబ్రవరి 10న టెడ్డీ డే, ఫిబ్రవరి 11న ప్రామిస్ డే, ఫిబ్రవరి 12న హగ్ డే, ఫిబ్రవరి 13న కిస్ డే అంటూ వారమంతా వాలెంటైన్ వీక్ సెలబ్రేషన్ వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా పాశ్యాత్య దేశాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వాలెంటైన్ వీక్‌లో భాగంగా వచ్చే టెడ్డీ డేను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. హ్యాపీ టెడ్డీ డే.
Also Read: ఎలా చెప్పనమ్మా ఎదలోని ప్రేమను..!