శరీరంలో వేడిని తగ్గించుకోవడం ఎలా?
ఎండాకాలంలో అందరినీ బాధించేది వేడి.
ఎండాకాలంలో అందరినీ బాధించేది వేడి. ఈ వేడి నుంచి తప్పించుకోవడానికి ప్రజలు అనేక మార్గాలను వెతుకుతుంటారు. బయటికి వెళ్తే వడదెబ్బ తగలకుండా గొడుగు లాంటివి వెంట తీసుకెళ్తుంటారు. ఆహార అలవాట్లలో మసాలాలు, ఉప్పును బాగా తగ్గిస్తారు. ఇలాంటి చిట్కాలే అనేకం ఉన్నాయి. ఈ క్రింద చెప్పిన విధంగా పలు చిట్కాలను పాటిస్తే శరీరంలో ఉన్న వేడిని, మంటను తగ్గించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది.
- ప్రతిరోజూ రెండు సార్లు కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా తాగాలి.
- రోజూ స్పూన్ మెంతుల్ని ఆహారంలో చేర్చుకోవాలి.
- గ్లాస్ గోరువెచ్చని పాలల్లో తేనె కలుపుకొని రోజూ తాగాలి.
- గసగసాలను పొడిచేసి వేడి పాలలో కలుపుకొని తాగాలి.
- పుచ్చకాయ తింటే శరీరంలో వేడి తగ్గుతుంది.
- మజ్జిగను తీసుకుంటే వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
- పుదీనా, కీరా దోసకాయ, పెరుగు, లస్సీ వంటివి తీసుకోవడం వల్ల కూడా వేడి తగ్గుతుంది.