హలో, చిత్రలహరి చిత్రాలతో తెలుగు ఆడియెన్స్‌కి సుపరిచితమైన హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ( Actress Kalyani Priyadarshan ). కళ్యాణి ప్రియదర్శన్ ఎవరో కాదు.. కేరళకు చెందిన ప్రముఖ ఫిలింమేకర్ ప్రియదర్శన్ ( Director Priyadarshan ) ముద్దుల కూతురే ఈ కళ్యాణి ప్రియదర్శన్. హలో, చిత్రలహరి, రణరంగం చిత్రాల తర్వాత తమిళ, మళయాళం భాషల చిత్రాలతోనే బిజీ అయిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం మళయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్‌తో ( Mohan Lal's son Pranav Mohanlal ) డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. కల్యాణి ప్రియదర్శన్, ప్రణవ్ లాల్ మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. నడుస్తున్నట్టు వస్తున్న వార్తలు ఏ స్థాయిలో వైరల్ అయ్యాయంటే... ఆ వార్తలను చూసి ఏకంగా మోహన్ లాల్ ( Mohanlal ) స్పందించాల్సి వచ్చింది. ఈ విషయంలో ఊహాగానాలు వద్దంటూ మోహన్ లాల్ మీడియాకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందంటే.. కళ్యాణి ప్రియదర్శన్ - ప్రణవ్ లాల్ డేటింగ్ న్యూస్ ఎంత వైరల్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. Also read : Singers Sunitha, Malavika: సింగర్స్ సునీత, మాళవికకు కరోనా పాజిటివ్


ఈ విషయంలో కళ్యాణి కల్యాణి ప్రియదర్శన్ నుండి కానీ లేదా ప్రణవ్ నుంచి కానీ ఇద్దరి నుండి ఎలాంటి స్పందన లేకపోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ ఇవి పుకార్లేనా లేక ఇందులో నిజం ఉందా అనేది తెలిసే ఛాన్స్ లేదు. Also read : Trisha: త్రిష వాటిని ఎందుకు డిలీట్ చేసింది ?