KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలకు అప్లై చేసేందుకు నేడే ఆఖరు తేదీ.. అప్లై చేయండిలా!
Last Date for Applying Jobs in KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయాల్లో 13 వేలకు పైగా పోస్టుల భర్తీకి చాలా రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే, ఇక వాటికి నమోదు చేసుకునేందుకు ఇదే చివరి తేదీ.
Last Date for Applying Jobs in KVS Recruitment 2022: మీరు చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీకు ఉపయోగపడవచ్చు, ఏమాత్రం మిస్ చేయకుండా చూడండి. ఈ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 13,403 టీచర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈరోజే ఆఖరు తేదీ. కేంద్రీయ విద్యాలయాల్లో 13 వేలకు పైగా పోస్టుల భర్తీకి చాలా రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదలైంది.
అందులో ప్రాథమిక ఉపాధ్యాయులు, TGT, PGT సహా ఇతర పోస్టుల కోసం ఖాళీగా ఉన్న ఉద్యోగాల కోసం ఆసక్తి గల, అర్హత గల అభ్యర్థులు కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) https://kvsangathan.nic.in/ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైమరీ టీచర్స్ పోస్టులు 6,414, PGT అలాగే TGT పోస్టులు 6,990 దాకా ఉన్నాయి. ఈ కేంద్రీయ విద్యాలయ సంగతన్ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 05 నుండి ప్రారంభమయ్యాయి, ఈ అభ్యర్థులు తమ విద్యార్హత ఆధారంగా 26 డిసెంబర్ 2022 అంటే ఈరోజు లోపే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
పోస్టులు ఎన్ని ఉన్నాయంటే:
ప్రైమరీ టీచర్: 6414 పోస్టులు, PGT: 1409 పోస్ట్‌లు, TGT: 3176 పోస్ట్‌లు, అసిస్టెంట్ కమిషనర్: 52 పోస్టులు, ప్రిన్సిపాల్: 239 పోస్టులు, వైస్ ప్రిన్సిపాల్: 203 పోస్టులు, లైబ్రేరియన్: 355 పోస్టులు, ప్రైమరీ టీచర్ (సంగీతం): 303 పోస్టులు, ఫైనాన్స్ ఆఫీసర్: 6 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్: 2 పోస్టులు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 156 పోస్టులు, హిందీ అనువాదకుడు: 11 పోస్ట్‌లు, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 322 పోస్టులు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: 702 పోస్టులు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II: 54 పోస్టుల కోసం ఈరోజే చివరి రోజు కావడంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఈ ఉద్యోగాలకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ డిగ్రీ వరకు గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కేంద్రీయ విద్యాలయ సంగతన్ వివరణాత్మక నోటిఫికేషన్ ద్వారా విద్యార్హత మరియు వయోపరిమితి చెక్ చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థులు వ్రాత పరీక్ష అలాగే క్లాస్ డెమో/ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్‌లో పనితీరు ఆధారంగా ఎంపిక చేయబడతారు.
దరఖాస్తు రుసుము:
పైన పేర్కొన్న అన్ని పోస్టులకు దరఖాస్తు రుసుము వేర్వేరుగా ఉంటుంది, అభ్యర్థులు వివరణాత్మక నోటిఫికేషన్‌లో దరఖాస్తు రుసుమును మీరు చెక్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీ కాప్డ్ మరియు ఎక్స్-సర్వీస్‌మెన్ వర్గానికి చెందిన అభ్యర్థులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఏ పోస్టుకు ఎంత జీతం వస్తుందో తెలుసా?
ప్రాథమిక ఉపాధ్యాయుడు: రూ. 35,400 నుండి రూ. 1,12,400 (పే లెవల్-6) PGT: రూ. 47,600 నుండి రూ. 1,51,100 (పే లెవల్-8) TGT: రూ. 44,900 నుండి రూ. 1,42,400 (పే లెవల్-7) అసిస్టెంట్ కమిషనర్: రూ. 78,800 నుండి రూ. 2,09,200 (పే లెవల్-12) ప్రిన్సిపాల్: రూ. 78,800 నుండి రూ. 2,09,200 (పే లెవల్-12) వైస్ ప్రిన్సిపాల్: రూ. 56,100 నుండి రూ. 1,77,500 (పే లెవల్-10) లైబ్రేరియన్: రూ. 44,900 నుండి రూ. 1,42,400 (పే లెవల్-7) ఫైనాన్స్ ఆఫీసర్: రూ. 44,900 నుండి రూ. 1,42,400 (పే లెవెల్-7) అసిస్టెంట్ ఇంజనీర్: రూ. 44,900 నుండి రూ. 1,42,400 (పే లెవెల్-7) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: రూ. 35,400 నుండి రూ. 1,12,400 (పే లెవెల్-6) హిందీ అనువాదకుడు: రూ.35,400 నుండి రూ.1,12,400 (పే లెవల్-6) సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: రూ. 25,500 నుండి రూ. 81,100 (పే లెవెల్-4) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్: రూ. 19,900 నుండి రూ. 63,200 (పే లెవెల్-2) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II: రూ. 25,500 నుండి రూ. 81,100 (పే లెవల్-4).
Also Read: Mythri Movie Makers Love: చిరు వద్దు బాలయ్య ముద్దు.. మైత్రీ వారి సవతి ప్రేమ నిజమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.