Chiranjeevi About Niharika Marriage : మెగాస్టార్ చిరంజీవి ఇంట మరికొన్ని గంటల్లో పెళ్లిబాజాలు మోగనున్నాయి. మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నటి, నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో కాబోయే దంపతులు నిహారిక, చైతన్యలకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అంతటితో ఆగకుండా తన ప్రేమను వ్యక్తం చేస్తూ, భావోద్వేగంతో ఓ పోస్ట్ చేశారు చిరు. ట్విట్టర్‌లో మెగాస్టార్ ట్వీట్ ట్రెండింగ్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభతరుణంలో, ముందస్తుగా, కాబోయే  దంపతులకు నా శుభాకాంక్షలు  , ఆశీస్సులు. God bless you!  #NisChayWedding’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. నిహారిక (Niharika Konidela) సైతం పెద్దనాన్నతో బాగా అల్లరి చేస్తుంది. పెద్దనాన్న చిరంజీవిని డాడీ అని ప్రేమగా పిలుస్తుంటుంది. నిహారిక పెళ్లి వేడుకను ఘనంగా జరిపేందుకు మెగా ఫ్యామిలీ మొత్తం నిన్ననే రాజస్థాన్ చేరుకుంది సంబరాలు షురూ చేయడం తెలిసిందే.


Also Read : Bigg Boss Telugu 4 Voting numbers: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్ 


 




మెగా డాటర్, టాలీవుడ్ నటి నిహారిక వివాహం గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిశ్చయమైంది. రాజస్థాన్‌లో నిహారిక, వెంకట చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కుటుంబసభ్యులు ప్లాన్ చేశారు. డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో ఉదయ్‌పూర్‌లో అత్యంత సన్నిహితుల సమక్షంలో నిహారిక, చైతన్యల వివాహం జరగనుందని తెలుస్తోంది.


Also Read : Niharika Wedding: రాజస్థాన్‌లో నిహారిక పెళ్లి సందడి షురూ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook