టాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, నమత్రా శిరోద్కర్ (Namrata Shirodkar) ఉంటారు. మహేశ్ బాబు (Mahesh Babu)తో పెళ్లి తర్వాత నమ్రతా ఇంటికి పరిమితమైనా ప్రిన్స్ మహేశ్ బాబుకు ఆమె సర్వస్వం అయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా దాదాపు 5 నెలలు ఇంటికే పరిమితమయ్యారు సూపర్ స్టార్ మహేశ్ బాబు. దీంతో కుటుంబానికి విలువైన సమయానికి కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో వీరి ముద్దుల తనయ సితార తీసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భర్త మహేశ్‌పై తన ప్రేమను తన జీవితం గురించి నమత్రా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది. ప్రేమతో ఉండటం వల్ల నాకు నమ్మకం కలిగింది. మనం సంతోషానికి ఉండటానికి కారణం ప్రేమ. ఒకరితో ఒకరు.. ఒకరిపై ఒకరు ప్రేమగా ఉండాలని.. అలాగే జీవించాలి. నా నిజమైన సంతోషంతో నేను దిగిన ఫొటో అని’ మహేశ్ బాబుతో కలిసి దిగిన ఫొటోను నమ్రతా పోస్ట్ చేసింది.  




కాగా, మహేశ్ బాబు సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా ఉంటే నమత్రా.. గౌతమ్, సితారలను కంటకి రెప్పలా చూసుకుంటోంది. వారి కోసం అధిక సమయాన్ని కేటాయిస్తూనే.. భర్త మహేశ్‌కు సంబంధించిన సినిమా అప్‌డేట్స్, ఫొటోలను షేర్ చేస్తుంటుంది. ఇటీవల మహేశ్ బాబు ఓ యాడ్ షూటింగ్ కోసం సెట్‌లో కనిపించగా ఆ ఫొటో సైతం వైరల్ అయింది.  


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe