Nishabdham Trailer: అంచనాలు పెంచేస్తోన్న ‘నిశ్శబ్దం’ ట్రైలర్

Nishabdham Official Trailer | అనుష్క శెట్టి, మాధవన్ మూవీ ‘నిశ్శబ్దం’. ఈ మూవీని ఓటీటీలో అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్ వేదికగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. అంచనాలు భారీగా పెరగడం ఖాయం. 

Last Updated : Sep 21, 2020, 06:35 PM IST
Nishabdham Trailer: అంచనాలు పెంచేస్తోన్న ‘నిశ్శబ్దం’ ట్రైలర్

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, మాధవన్ (R Madhavan) జంటగా తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘నిశ్శబ్దం’(Nishabdham). ఈ మూవీని ఓటీటీలో అక్టోబర్ 2న విడుదల చేస్తున్నారు. నిశ్శబ్దం ట్రైలర్‌ నేడు విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్ వేదికగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ (Nishabdham Official Trailer) చూస్తే.. అంచనాలు భారీగా పెరగడం ఖాయం. 

స్వీటీ అనుష్క (Anushka Shetty) ఈ సినిమాలో దివ్యాంగురాలి పాత్ర పోషించారు. మాధవన్, అనుష్క ఓ ఇంటికి వెళ్లగా.. అక్కడ ఉండే దెయ్యం కారణంగా వీరు కేసులో ఇరుక్కుంటారు. అనుష్క బెస్ట్ ఫ్రెండ్ షాలిని పాండే ఓ కేసులో అరెస్ట్ కావడంతో ఆమెను విడిపించాలంటే మూగ, చెవిటి అయిన అనుష్క సాక్ష్యం ఎలా చెప్పిందనేది నిశ్శబ్దం మూవీ స్టోరీ లైన్. Actor Arya: కోలీవుడ్ నటుడు ఆర్యకు కోర్టు నోటీసులు

నటి అంజలి, హాలీవుడ్ నటుడు ఆండ్రూ హడ్సన్ పోలీసు అధికారులుగా కనిపించనున్నారు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో నిశ్శబ్దం మూవీ విడుదల కానుంది.   

ఫొటో గ్యాలరీలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe

Trending News