నువు రాముడేషమే కట్టావంటే గుండెలు అన్నీ గుడులైపోతాయే.... 
నువు కృష్ణుడల్లె తెరమీదకి వస్తే వెన్నముద్దలై కరిగే హృదయాలే... 
ఆ దేవుడు ఎదురుగ వచ్చిన దేవుడు కాదంటాం... 
ఎందుకనీ అడిగాడో.. ఎన్టీఆర్ పోలిక ఒకటీ లేదంటాం... 
తెల్లారిగట్ల లేచిపోయి.. చద్దికూడు పట్టుకుని ఎడ్ల బళ్లు కట్టుకుని వచ్చేశాం.. 
మేం చొక్కాలెన్నో చింపుకున్నాం.. గొంతులన్నీ చించుకున్నాం.. 
తనివితీరనిది నీపై అభిమానం... 
నువ్వందుకున్న ఘనతని చదివితే.. ముచ్చమటలు పట్టవా చరితకే.. 
ఆ గెలుపను నింగికి నువ్విక చందమామే... 
ఎవ్వడికీ రాదులేరా... నీలో ఎంత రాజసంరా.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్టీఆర్ ఘనకీర్తిని స్మరించుకుంటూ ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల ఎన్టీఆర్ బయోపిక్ మూవీ కోసం రాసిన పాటలోని పలు ఆణిముత్యాల్లాంటి పదాలు. ఈ పాటలో ఒక్కో లైన్ వింటుంటే.. ఎన్టీఆర్ ఘన చరిత్ర ఒక్కసారి కళ్లముందు కదలాడినట్టుగా అనిపిస్తోంది. ఎంఎం కీరవాణి కంపోజిషన్‌లో కాల బైరవ, పృధ్వీ చంద్ర పాడిన ఈ పాటను తాజాగా ఎన్.టి.ఆర్ బయోపిక్ మేకర్స్ టీ సిరీస్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేశారు. బాలయ్య బాబు ఎన్.టి.ఆర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా జనవరి 9న 'కథానాయకుడు', ఫిబ్రవరి 7న 'మహా నాయకుడు' అనే టైటిల్స్‌తో రెండు భాగాలుగా ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఇప్పటికే విుదలైన ఈ ఎన్.టి.ఆర్ బయోపిక్ ట్రైలర్‌కి సైతం అద్భుతమైన స్పందన కనిపిిస్తోంది.