ఎన్.టి.ఆర్ బయోపిక్ ట్రైలర్: ఎన్.టి.ఆర్‌ని మైమరిపించిన బాలయ్య బాబు

ఎన్.టి.ఆర్ బయోపిక్ ట్రైలర్: ఎన్.టి.ఆరే మళ్లీ తిరిగొచ్చారా ?

Last Updated : Dec 22, 2018, 01:14 PM IST
ఎన్.టి.ఆర్ బయోపిక్ ట్రైలర్: ఎన్.టి.ఆర్‌ని మైమరిపించిన బాలయ్య బాబు

తెలుగు సినీ చరిత్ర గమనాన్ని శాసించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగునాట రాజకీయాలకు కొత్త నడక నేర్పించి, జాతీయ పార్టీలకు తెలుగువారి సత్తాను చాటిన ధీరుడు, అడుగడుగునా సంచలన విజయాలను నమోదు చేసుకున్న నాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామా రావు గారి యదార్ధగాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ మూవీ ట్రైలర్ తాజాగా ఆడియెన్స్ ముందుకొచ్చింది. నందమూరి బాలకృష్ణ మొదటిసారి నిర్మాతగా మారి నిర్మించిన ఈ సినిమా కోసం ఆయన డబ్బునే కాదు.. తన ప్రాణాన్ని కూడా పెట్టారని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ మూవీలో ఎన్.టి.ఆర్ పాత్ర పోషించిన బాలయ్య బాబును చూస్తే, ఎన్టీఆరే మళ్లీ మనమధ్యకు తిరిగొచ్చారా అనేంత సహజత్వం ఉట్టిపడుతోంది. ఎన్.టి.ఆర్ నడక, నడవడిక, హావభావాలు, మాట్లాడే తీరు ఎక్కడా తేడా రాకుండా డైరెక్టర్ క్రిష్ జాగ్రత్తలు తీసుకోగా.. ఎన్.టి.ఆర్ పాత్రలో బాలయ్య బాబు జీవించారు.

ఎన్.టి.ఆర్‌ జీవించి వుండగా ఆయనను చూసిన పాత తరం వారికి మళ్లీ ఎన్.టి.ఆర్‌నే చూసినట్టుగా అనిపిస్తే, ఆయన్ను చూడని యువతరానికి ఎన్.టి.ఆర్ కూడా ఇలాగే వుండేవారేమో అనేంత గొప్పగా బాలయ్య బాబు ఆ గెటప్‌లో కనిపించారు. కథా నాయకుడు, మహా నాయకుడు అని రెండు భాగాలుగా వస్తున్న ఎన్.టి.ఆర్ బయోపిక్‌పై పెంచేదిగా వుంది ఈ ట్రైలర్. అంచనాలకు తగినట్టుగా సినిమా ఉంటుందా లేదా తెలియాలంటే, జనవరి 9న కథానాయకుడు, ఫిబ్రవరి 7న మహా నాయకుడు విడుదలయ్యే వరకు వేచిచూడాల్సిందే.

Trending News