TG Vishwa Prasad Meets Pawan Kalyan: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో సినీ ఇండస్ట్రీలో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గించడంతో కొందరు నిర్మాతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ కూడా వైసీపీకి వ్యతిరేకంగా తమ గళం విప్పారు. కూటమి అధికారంలోకి రావడం.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఇండస్ట్రీలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. పవన్ కళ్యాణ్‌తో నిర్మాతలు భేటీ అయిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచినందుకే కంగ్రాట్స్ చెబుతునే ఇండస్ట్రీ గురించి చర్చించారు. పవన్ కళ్యాణ్‌ను కలిసిన వారిలో పీపుల్ టెక్ గ్రూప్ అధినేత, ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ కూడా ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Indian Railways: ట్రైన్  టికెట్ లు బుకింగ్ లు చేస్తే జైలుకే.. ఆ వార్తలు ఫేక్.. IRCTC కీలక ప్రకటన..


ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి రావడంతో టీజీ విశ్వప్రసాద్ ఇటీవల గ్రాండ్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఓ పెద్ద కన్వెన్షన్ హాల్‌లో వేడుకలు నిర్వహించగా.. ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ మారుతి, శ్రీవాస్, శ్రీరామ్ ఆదిత్య, హీరో తేజ సజ్జా, ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్, దామోదర ప్రసాద్, బాలాదిత్య, సప్తగిరి, హైపర్ ఆది, ఆర్పీ పట్నాయక్, రామజోగయ్య శాస్త్రి, సింగర్ మంగ్లీ తదితరులు హాజరై మాట్లాడారు. కూటమి అధికారంలోకి రావడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. ఆదోని అసెంబ్లీ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా వేడులకల్లో భాగమయ్యారు. ఈ సందర్బంగా కూటమి విజయానికి కృషి చేసిన వారిని టీజీ విశ్వప్రసాద్ సత్కరించారు.


పవన్‌తో టీజీ విశ్వప్రసాద్‌కు ప్రత్యేక సాన్నిహిత్యం ఉంది. పవన్-సాయిధరమ్ తేజ్‌ కాంబో వచ్చిన బ్రో మూవీ టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా జనసేన పార్టీకి కూడా ఆయన అండగా నిలిచారు. దీంతో పవన్‌ను ప్రత్యేకంగా అభినందించిన టీజీ విశ్వప్రసాద్.. కూటమిపై హర్షం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో టీజీ విశ్వప్రసాద్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటు యువ హీరోలతో సినిమాలు తీస్తూ ప్రోత్సహిస్తూనే.. అటు అగ్ర హీరోలతో సినిమాలు చేస్తున్నారు. వరుస హిట్స్‌తో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు.   


Also Read: Indian Railways: ట్రైన్  టికెట్ లు బుకింగ్ లు చేస్తే జైలుకే.. ఆ వార్తలు ఫేక్.. IRCTC కీలక ప్రకటన..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter