Indian Railways: ట్రైన్ టికెట్ లు బుక్ చేస్తే జైలుకే.. ఆ వార్తలు ఫేక్.. IRCTC కీలక ప్రకటన..

IRCTC train ticket booking rules: కొన్నిరోజులుగా ఐఆర్సీటీసీ కి చెందిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగవైరల్ గా మారింది. మన పర్సనల్ ఐడీల మీద రక్త సంబంధీకులకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకొవచ్చని, ఇతరులకు బుక్ చేయోద్దంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై తాజాగా, ఇండియన్ రైల్వేస్ క్లారిటీ ఇచ్చిది.

1 /6

మన దేశంలో చాలా మంది దూర ప్రాంతాలకు జర్నీలు చేసేవారు ఎక్కువగా రైల్వేప్రయాణాన్ని ఎంచుకుంటారు. దీని వల్ల ఈజీగా గమ్య స్థానంలో చేరడంతో పాటు జర్నీచేసిన ఫీలింగ్ రాదు. అంతేకాకుండా.. మధ్య మధ్యలో అటు ఇటు నడుస్తూ... ట్రైన్ లో ఎంజాయ్ చేస్తుంటారు. బస్సులు, విమానాల్లో ఈ ఫెసిలీటి ఉండదు. అందుకే ఎక్కువ మంది రైల్వే జర్నీ  మాత్రమే ఫ్రిఫర్ చేస్తుంటారు.

2 /6

చాలా మంది రైల్వే బుక్కింగ్ కోసం ఐఆర్సీటీసీ వెబ్ సైట్ కు వెళ్తుంటారు. ఎవరికి వారే తమ ఐడీలలో బుకింగ్ లు చేసుకుంటారు. కానీ కొందరు మాత్రం ఇప్పటికి కూడా థర్డ్ పార్టీ మీద రైల్వే బుకింగ్ కోసం ఆధారపడుతుంటారు. మరికొందరు తెలిసిన వాళ్లను రైలు టికెట్ బుక్ చేయమంటారు. చార్జీలు ఇచ్చేస్తుంటారు.

3 /6

ఇదిలా ఉండగా.. ఇటీవల రైల్వేశాఖ ఒక షాకింగ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. చాలామంది తమ IRCTC ఖాతా నుంచి తమ స్నేహితులు, బంధువులకు టికెట్ బుక్ చేస్తుంటారు. పర్సనల్ IRCTC ఐడీ ద్వారా ఇతరులకు రైలు టికెట్లు బుక్ చేస్తే.. జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడుతుందని వార్త ట్రెండింగ్ లో నిలిచింది.

4 /6

రైల్వే కొత్త చట్టాలు వచ్చాయని,  సెక్షన్ 143 ప్రకారం ఆథరైజ్డ్ ఏజెంట్లు మాత్రమే థర్డ్ పార్టీ పేరుపై టికెట్లు బుక్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ ఖాతా ద్వారా ఇతరులకు మీరు టికెట్లు బుక్ చేస్తే ..గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా.. రూ.10 వేల వరకు జరిమానా పడే ఛాన్సులు ఉన్నాయని ప్రచారం కూడా జరిగింది.  కేవలం రక్తసంబంధీకులు, ఒకే ఇంటిపేరుతో ఉన్నవారికి మాత్రమే టికెట్లు బుక్‌ చేసుకునే అవకాశం ఉందట. స్నేహితులు, ఇతరులకు ట్రైన్ టికెట్లను బుక్‌ చేస్తే చట్టపరంగా శిక్షార్హులని ప్రచారం జరిగింది.

5 /6

తాజాగా, దీనిపై స్పందించిన ఇండియన్ రైల్వేస్ అవన్ని ఫెక్ వార్తలంటూ కొట్టిపారేసింది. పర్సనల్ ఐడీలతో బుకింగ్ లపై నియంత్రణ ఉందన్న వార్తలలో నిజం లేదని తెల్చి చెప్పింది.ఇది రైల్వే ప్రయాణికులను పూర్తిగా తప్పుదొవ పట్టించే  వార్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్సనల్ ఐడీలతో నెలకు 12, ఆధార్ అనుసంధానం ఉంటే.. 24 టికెట్లు బుకింగ్ లు చేసుకొవచ్చని ఇండియన్ రైల్వేస్ క్లారిటీ ఇచ్చింది.  

6 /6

 కానీ కొందరు వాణిజ్య అవసరాల కోసం పర్సనల్ ఐడీలను ఉపయోగిస్తారని ఇలా చేస్తే మాత్రం రైల్వే చట్టం ప్రకారం నేరమని ఐఆర్సీటీసీ క్లారిటీ ఇచ్చింది. అసత్య ప్రచారాలు చేస్తు, రైల్వే ఆదాయంను దెబ్బతీసేలా రూమర్స్ వ్యాప్తిచేస్తే.. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఇండియన్ రైల్వేస్ తెల్చి చెప్పింది.