Relief For Taxpayers: పన్ను చెల్లింపుదారులకు తీపికబురు..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల దాఖలు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి గడువును ను జులై 31 వరకు పెంచింది.
Also Read: CM KCR: ఆ విషయంలో తెలంగాణ నెంబర్ 1
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తాజాగా ఓ ప్రకటనను విడుదల చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట కలగనుంది. 2018-19 ఏడాదికి గాను సవరణ చేయబడిన రిటర్న్స్ దాఖలు చేయడానికి విధించిన గడువు ఈ నెలాఖరుతో ముగియనుండగా దాన్ని జులై 31 కి పెంచిన కేంద్రం మరోవైపు, పాన్ కార్డు, ఆధార్ కార్డులను అనుసంధానం చేసుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. కాగా ఇప్పటివరకు ప్రకటించిన డెడ్‌లైన్ ఈ నెలాఖరుతో ముగియనుండగా, కరోనా, లాక్‌డౌన్ నేపథ్యంలో గడువును వచ్చే ఏడాది మార్చి వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021 మార్చి 31లో ఈ రెండు కార్డులను అనుసంధానం చేసుకోవాలని లేదంటే రూ.10వేల జరిమానా భారం పడొచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ