Harithaharam 6th Phase: తెలంగాణ ముఖ్యముంత్రి కేసీఆర్ ( CM KCR ) గురువారం ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ అభివృద్ధిలో మిగితా రాష్ట్రాల కన్నా మెరుగైన స్థితిలో ఉందని అన్నారు. ఆరవ విడత హరితహారం (6th Phase Of HarithaHaram) కార్యక్రమాన్ని నేడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం కేసీఆర్.. తెలంగాణ ధనిక రాష్ట్రమని ( Telangana is a rich state ).. అభివృద్ధి పనులకు కావాల్సిన నిధుల కొరత లేదు అని తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 15 కోట్లతో నిర్మించిన అర్బన్ పార్కును కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పలు కీలక విషయాలను ప్రస్తావించారు. పచ్చదనం అందరి బాధ్యత అని.. ప్రజా ప్రతినిధులు పచ్చదనాన్ని పెంచడానికి కృషి చేయాలని కోరారు. ( Also read : దేశ గతిని మార్చిన పీవీకి భారతరత్న ఇవ్వాలి: కేసీఆర్ )
ప్రజాప్రతినిధులకు జీతాలు ఆపి మరీ రైతులకు ఆర్థిక సహాయం:
లాక్ డౌన్ ( Lockdown ) సమయంలో రైతులుకు డబ్బులు ఇచ్చామని.. ప్రజాప్రతినిధులకు జీతాలు ఆపి మరీ వారికి ఆర్థిక సహాయం చేసినట్టు సీఎం కేసీఆర్ గర్తుచేశారు. అయితే ఇప్పుడు ఆర్థికంగా పరిస్థితి బాగుందని.. తెలంగాణ ఎప్పుడూ ధనిక రాష్ట్రమేనని అన్నారు. తెలంగాణలో ప్రతీ గ్రామంలో నర్సరీ ఉందన్న సీఎం కేసీఆర్... ఈ విషయంలో దేశంలో తెలంగాణ రాష్ట్రమే ముందుంది అని తెలిపారు.
FCI స్వయంగా చెప్పింది:
తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారిందని స్వయంగా ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ( FCI ) చెప్పిందన్నారు. విద్యుత్ సమస్యలున్న ( Power Cut ) రాష్ట్రం నుంచి 24 గంటలు పవర్ సప్లై ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మారిందన్నారు. అదే సమయంలో త్వరలో సంగారెడ్డికి కాలేశ్వరం ( Kaleshwaram project ) నీళ్లు వస్తాయని... తెలంగాణ అభివృద్ధి విషయంలో అందరూ తలో చేయి వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు.