Reliance Jio: కస్టమర్లకు జియో షాక్..!!
కొన్ని నెలల క్రితం టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచడమే వినియోగదారులను షాకింగ్ కు గురి చేసింది. అయితే ఇప్పుడు మరోసారి రిలయన్స్ జియో తన టారిఫ్ ధరలను పెంచడం మరింత షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ఒక జీబీకి రూ.15 చొప్పున ఉన్న డేటా ధరలను రూ .20 కి పెంచాలని రిలయన్స్ జియో వెల్లడించింది.
ముంబై: కొన్ని నెలల క్రితం టెలికాం కంపెనీలు టారిఫ్ ధరలను పెంచడమే వినియోగదారులను షాకింగ్ కు గురి చేసింది. అయితే ఇప్పుడు మరోసారి రిలయన్స్ జియో తన టారిఫ్ ధరలను పెంచడం మరింత షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ఒక జీబీకి రూ.15 చొప్పున ఉన్న డేటా ధరలను రూ .20 కి పెంచాలని రిలయన్స్ జియో వెల్లడించింది.
అకస్మాత్తుగా ధరల పెరుగుదలపై వినియోగదారులు మండిపడుతున్నారు. ప్రస్తుత పరిస్తితుల్లో జియో మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ పెంచిన ధరలపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వోడాఫోన్ ఎయిర్టెల్ వరుసగా 53,000 కోట్ల రూపాయలు 36,000 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఆదాయా వనరుల విషయంలో, సంపాదన విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Read Also: అందుబాటులోకి వాట్సప్ కొత్త ఫీచర్..!!
ఇటీవలి ధరల సవరణతో, జియో ఇప్పటికే 4జీ డేటా వేగంతో దేశమంతటా వినియోగదారులకు అత్యంత చౌక ధరలకే అందిస్తుండగా అదే స్థితిని కొనసాగిస్తోంది. కాగా జియో నెట్వర్క్, జియోయేతర నంబర్లకు కాల్ చేసినప్పుడు వినియోగదారులకు నిమిషానికి 60 పైసలు వసూలు చేస్తుంది. మరోవైపు ఎయిర్టెల్, వొడాఫోన్ నెట్వర్క్ సంస్థలు ఈ రెండు సంస్థల కస్టమర్లు ఇతరులకు కాల్ చేసినప్పుడు ఎటువంటి చార్జీలు వసూలు చేయడం లేదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..