Python Video: పాములు చూస్తే హడలెక్కిపోతుంటాం. అందులో భారీ కొండ చిలువలంటే ఇంకా. కానీ ప్రశాంతంగా కూర్చున్న ఆ అమ్మాయి వద్దకు ఏకంగా మూడు భారీ కొండ చిలువలు ప్రేమతో చేరుకోవడం..ఆ తరువాత ఏమైంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో జంతు జీవాల వీడియోలు ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. పాములు, పులులు, మొసళ్ల వంటి వీడియోలైతే ఇంకా విస్తృతంగా వైరల్ అవుతాయి. ప్రతిరోజూ వందలాది వీడియోలు వైరల్ అవడం చూస్తుంటాం. కొన్ని వీడియోలు భయం గొలుపుతుంటాయి. కొన్ని ఆలోచన రేకెత్తిస్తుంటాయి. ఇంకొన్ని ఆశ్చర్చపరుస్తుంటాయి.  ఈ క్రమంలో ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే రోమాలు నిక్కబొడుస్తాయి. షాక్ కలగడం ఖాయం.


ఓ చిన్న అమ్మాయి హాయిగా ప్రశాంతంగా కూర్చుని ఉంది. అక్కడికి అతి పొడవైన భారీ కొండ చిలువ వస్తుంది. ఆశ్చర్యమేమంటే ఆ అమ్మాయి అస్సలు భయపడదు. సరికదా ప్రేమతో ఒళ్లో తీసుకుని లాలిస్తుంటుంది. ఆ అమ్మాయికి ఎలా ఉందో గానీ చూసేవారికి మాత్రం పిచ్చెక్కిపోతుంది. అంతలో మరో రెండు భారీ కొండ చిలువలు అక్కడికి చేరుకుంటాయి. ఒక్కొక్కటి దాదాపుగా 20 అడుగుల పొడుగుతో చాలా లావుగా ఉన్నాయి. ఆ పాములు ఆ అమ్మాయిని ఏం చేయవు. అటు ఆ అమ్మాయి కూడా ప్రేమతో దగ్గరకు తీసుకుంటుంది. 


ఇందులో అమ్మాయి..ఓ కొండచిలువ ముఖాన్ని పట్టుకుని లాలించడం చూడవచ్చు. పాము కూడా ఆ అమ్మాయి ఒళ్లో..చేతిలో ఒదిగిపోతుంది. అంత పెద్ద పెద్ద భారీ కొండచిలువల్ని చూస్తే మనకైతే పై ప్రాణాలు పైనే పోతాయి. ఈ అమ్మాయి మాత్రం దగ్గరకు తీసుకుని లాలిస్తుంటుంది. 


Also read: Viral Video: ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణాలు దక్కేవి కాదు.. తృటిలో పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తండ్రి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook